ఖమ్మంలో కరోనా పాజిటివ్ కేసు నేపథ్యంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం

కరోనా వైరస్ వ్యాప్తి నుండి ఖమ్మం జిల్లాను సురక్షితంగా ఉంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పాజిటివ్ కేసు నమోదు అదుపరి తీసుకున్న చర్యలను మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, DMHO మాలతి, వైద్య అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

అనంతరం ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా నెలరోజుల వరకు కూడా ఖమ్మం జిల్లా పాజిటివ్ కేసు రాలేదు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన ఖమ్మం రూరల్ మండలంకు చెందిన వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్లు సోమవారం రిపోర్టు వచ్చిన వెంటనే అట్టి వ్యక్తిని గాంధీ అసుపత్రి చికిత్స నిమిత్తం తరలించామని మంత్రి చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ఐసోలేషన్ లో ఉన్న 12 మందికి నెగిటీవ్ రిపోర్టు వచ్చిందని, జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు భయాందోళనకు గురి కారాదని మంత్రి తెలిపారు. వైరస్ ను పూర్తిగా కట్టడి చేసేందుకు స్వీయ నిర్భందం ఒక్కటే మార్గమని, ప్రజలు నియంత్రణ, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని మంత్రి కోరారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసరమైన వస్తువులు, కూరగాయలు డివిజన్ల పరిధిలోనే లభించే విధంగా ఏర్పాట్లు చేశామని, నగరంలోని ప్రజలు రోడ్ల పైకి రావద్దని మంత్రి అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా పూర్తిగా సహకరించాలని, జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించిన పిదపనే వైరస్ కి సంబంధించిన వార్తలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో 45 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో అట్టి వ్యక్తి ఇతరులతో కలిసిన వివరాలను సేకరించి వారి నమూనాలను నిర్ధారణకు పంపడం జరిగిందని అన్నారు.

పెద్దతండాలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ నేతృత్వంలో 19 బంధాలు స్ధానికులను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు రఘునాధపాలెం, నేలకొండపల్లి ప్రాంతాలలో కూడా సర్వే చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. (మైనర్ కాంటాక్ట్ కలిగిన వారి నమూనాలను పరీక్షకు పంపడం జరిగిందని, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారు స్వచ్చందంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని నేటి నుండి ఉదయం 11.00 గంటల వరకే నిత్యవసర వస్తువులు, కూరగాయల చేపలు అనుమతిస్తున్నామని, 11.00 గంటల తర్వాత కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని ప్రజలేవ్వరూ అనవసరంగా బయటికి రావద్దని అన్నారు. అందరు మాస్క్ లు ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉందని, 4 వందల పడకల ఐసోలేషన్, పరిస్థితులకు సరిపడే క్వారంటైన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పువ్వాడ వివరించారు.


More Press News