కరోనాకు మందు లేదు.. నియంత్రణే ఏకైక మార్గం: బోయినపల్లి వినోద్ కుమార్

  • భౌతిక దూరమే.. వ్యాక్సిన్
భౌతిక దూరాన్ని పాటించడమే వ్యాక్సిన్ అని, ఇదొక్కటే మానవ మనుగడకు ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని బోరబండలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ లతో కలిసి వినోద్ కుమార్ బుధవారం పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ కు మందు లేదని, ముందస్తుగా నియంత్రణ చర్యలు మాత్రమే శరణ్యమని పేర్కొన్నారు.

కఠినంగా స్వీయ నియంత్రణ.. భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా బారీ నుంచి బయట పడవచ్చని వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ప్రపంచ శ్రేణి పారిశ్రామిక వేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న అవకాశాలను విశ్లేషిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావడానికి ఎలాంటి విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

More Press News