ఉచితంగా హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

◆ కొవిడ్‌ బాధితులకు సర్కారు అండ
◆ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్ ను సమూలంగా తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కరోనా వ్యాధి నిర్దారణ (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్) మరియు హోంఐసొలేషన్‌ కిట్లను మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికై అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఉండాలన్నారు. తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని కోరారు. ఇప్పటికే వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ప్రారంభించిందన్నారు.

తాజాగా అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేయడమైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బాధితులు హోంఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్‌ ద్వారా సూచనలు చేస్తున్నారని వివరించారు. అత్యవసరమైన వారి కోసం త్వరితగతిన అంబులెన్సులను ఇండ్లకు పంపించి కొవిడ్‌ దవాఖానల్ల్లో చేర్చే ఏర్పాట్లు చేస్తుందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేయడంతో వారికి ప్రయోజనకరంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో 85శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారని వీరు హోంఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉంటాయిని, దీంతో పాటు హోంఐసొలేషన్‌ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్‌, కాల్‌ సెంటర్‌ నంబర్లు, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబైల్‌ నంబర్లను పొందుపరచడం జరిగిందన్నారు.

ఐసొలేషన్‌ కిట్‌లో ఉండే వస్తువులు:

విటమిన్‌-సీ టాబ్లెట్స్‌: 34
జింక్‌ టాబ్లెట్స్: 17
బీ- కాంప్లెక్స్‌: 17
క్లాత్‌ మాస్కులు: 6
శానిటైజర్:1
హ్యాండ్‌ వాష్: 1
గ్లోవ్స్: 2
సోడియం హైపోక్లోరైట్‌ ద్రవం 1 బాటిల్

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, DM&HO మాలతి, RJC కృష్ణ, కార్పొరేటర్లు, వైద్యులు ఉన్నారు.

More Press News