తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్'‌ ఏర్పాటు: మంత్రి పువ్వాడ

తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు తొలిసారిగా ఖమ్మం కాలెక్టరేట్ ప్రాంతంలో మేయర్ పాపాలాల్ తో కలిసి షి మొబైల్ బయో-టాయిలెట్స్ ను వారు ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందేని అన్నారు. ప్రస్తుతం సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి సారించామని ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవలే  ఆదేశించారని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ‘స్త్రీ టాయిలెట్ల’ను ఆదర్శంగా తీసుకున్నామని సూచించారు. వీటిని తక్కువ వ్యవధిలో పూర్తి చేయడంతో పాటు కావాల్సిన చోటికి తరలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
 
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా అన్ని బయో టాయిలెట్స్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. సమీప ఆర్టీసీ డిపోల నుంచి కాలంచెల్లిన బస్సులను తీసుకొని వాటిని ‘స్త్రీ టాయిలెట్లు’గా మార్చాలని ఇప్పటికే సూచించామని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల కోసం వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. వీటిని రద్దీ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ప్రార్థనా మందిరాలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, వారాంతపు అంగళ్లు వంటి ప్రాంతాలకు తరలించవచ్చని పేర్కొన్నారు. వీటి నిర్వహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌) లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు లేదా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించాలని తలచమని అన్నారు.  
 
టాయిలెట్లలోని వసతులు..
-----------------------------
◆ ఇండియన్‌, వెస్ట్రన్‌ కమోడ్‌
◆ వ్యర్థాల నిర్వహణకు బయో-టాయిలెట్‌.
◆ తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు.
◆ శానిటరీ ప్యాడ్‌ డిస్పెన్సర్‌ ఏర్పాటు.
◆ వాష్‌ బేసిన్‌, అద్దం, కియోస్క్‌.
◆ చంటిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక స్థలం.
◆ టాయిలెట్‌ నిర్వాహకులకు ప్రత్యేక గది.
◆ ప్రకటనల బోర్డ్‌లకు ప్రత్యేక స్థలం.
◆ టాయిలెట్‌ను శుభ్రంచేసే సామగ్రిని దాచే స్థలం
◆ సోలార్‌ ప్యానల్‌ (అవసరాన్ని బట్టి)
◆ దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేకంగా ర్యాంపు, లోపలి సౌకర్యాలు
 
అదనపు పరికరాలు/సౌకర్యాలు
---------------------------------
◆ శుభ్రమైన నీరు.
◆  డోర్‌/కియోస్క్‌ వద్ద శానిటైజర్‌.
◆ డస్ట్‌బిన్‌, చేతులు కడుక్కోవడానికి సబ్బు/హ్యాండ్‌వాష్‌.
◆ డెయిలీ యూజ్‌, క్లీనింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ రిజిస్టర్లు.
◆ కంప్లయింట్‌ బాక్స్‌, హెల్ప్‌లైన్‌ నంబర్‌.  
◆ ఓడీఎఫ్‌, కరోనా వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక డిస్‌ప్లే.

More Press News