రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ
రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రైతును రాజును చేస్తానని తొలినాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పున విషయం గుర్తు చేశారు. నాడు చెప్పారు.. నేడు చేసి చూపిస్తున్నారు. అది నిబద్ధత అంటే అని కొనియాడారు. మాటలతో కాలయాపన చేయకుండా వ్యవసాయంను పండగ చేయాలనే ఒకే సంకల్పంతో నేటి వరకు అలుపెరుగక శ్రామిస్తున్న ముఖ్యమంత్రి దార్శనికత నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఖమ్మం జిల్లాలోని 129 క్లస్టర్ ల పరిధిలోని 129 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనితో పాటు రైతులకు కేటాయించిన కల్లాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజకవర్గానికి వెయ్యి కేటాయించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయని, రైతులందరినీ ఒకేచోటకు చేర్చి సాగుపై చర్చించుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించడం వ్యవసాయ రంగంలోనే ముందడుగు అన్నారు. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానున్నదని అన్నారు.
రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకే ఈ రైతు వేదిక ఎంతగానో దోహదపడుతాయని, రైతులు సమావేశాలు నిర్వహించుకొనేందుకు, ఇతర అవసరాలకు అనుగుణంగా రైతు వేదికలు నిర్మించడం జరుగుతుందన్నారు.
రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు ఉండనున్నాయని అన్నారు.
సీఎం కేసీఆర్ నేరుగా ఏ రైతుతోనైనా మాట్లాడే వెసులుబాటు, రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఉంటుందని, రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా అన్నదాతలకు అన్నివిధాలుగా ఉపయోగపడేలా అవసరమైతే గోదాంలుగా కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉందన్నారు.
ఎరువులు, విత్తనాలు, పరికరాలు వచ్చినప్పుడు వాటిని తాత్కాలికంగా భద్రపరిచేందుకు వీటిని ఉపయోగించుకోవొచ్చని అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, DCMS చైర్మన్ శేషగిరిరావు, అధికారుకు, నాయకులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అరుదైన చరిత్ర ఆవిష్కృతం కాబోతున్నందని, ఈ వానాకాలం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామంలోని లంకా సాగర్ చెరువు నుండి సాగునీటిని దిగువకు వదిలారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సీతారామ జిల్లాకు వరప్రదాయని అన్నారు.
కొత్త ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నదని, ప్రస్తుతం కృష్ణ, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేస్తే... ఈ విషయం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానాకాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో గరిష్ఠంగా 23 లక్షల ఎకరాలకే నీటిని అందించారు. సాధారణంగా ప్రతీ ఏడాది నీటి లభ్యతను బట్టి 10-20 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ వచ్చారని, వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి కూడా 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చిన సందర్భం లేదన్నారు. అయితే ప్రస్తుతం ఒక్క వానాకాలంలోనే 41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరేండ్ల పరిపాలన విజయంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో గోదావరి నది మీద వడివడిగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అనేక జిల్లాలకు ఈ ఏడాది దండిగా నీరు అందనుందని, దీనికి తోడు పాలమూరు జిల్లాలో కృష్ణా నది మీద తెలంగాణ వచ్చినంక పూర్తిచేసిన ఎత్తిపోతలు కూడా భారీగా నీటిని అందించనున్నాయన్నారు.
2014-15 సంవత్సరంలో తెలంగాణలో వానాకాలం పంటకు కేవలం 9,73,072 ఎకరాలకు నీరు అందితే, నేడు అది 41,00,000 ఎకరాలకు చేరుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, అధికారులు, రైతులు ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి ఆధ్వర్యంలో JVR ఓపెన్ కాస్ట్ ఆవరణలోని 41 హెక్టర్లలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై 24 నాడు మంత్రివర్యులు గౌ. కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా #GiftASmile కార్యక్రమంలో భాగంగా మనందరం ఇబ్బందిలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి ఆసరాగా ఉందామని, వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ, మరే ఇతర వ్యక్తిగత, సామాజిక అవసరాలను తీర్చి #GiftASmile కింద జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, సింగరేణి, అటవీశాఖ అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రైతును రాజును చేస్తానని తొలినాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పున విషయం గుర్తు చేశారు. నాడు చెప్పారు.. నేడు చేసి చూపిస్తున్నారు. అది నిబద్ధత అంటే అని కొనియాడారు. మాటలతో కాలయాపన చేయకుండా వ్యవసాయంను పండగ చేయాలనే ఒకే సంకల్పంతో నేటి వరకు అలుపెరుగక శ్రామిస్తున్న ముఖ్యమంత్రి దార్శనికత నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఖమ్మం జిల్లాలోని 129 క్లస్టర్ ల పరిధిలోని 129 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనితో పాటు రైతులకు కేటాయించిన కల్లాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజకవర్గానికి వెయ్యి కేటాయించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయని, రైతులందరినీ ఒకేచోటకు చేర్చి సాగుపై చర్చించుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించడం వ్యవసాయ రంగంలోనే ముందడుగు అన్నారు. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానున్నదని అన్నారు.
రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకే ఈ రైతు వేదిక ఎంతగానో దోహదపడుతాయని, రైతులు సమావేశాలు నిర్వహించుకొనేందుకు, ఇతర అవసరాలకు అనుగుణంగా రైతు వేదికలు నిర్మించడం జరుగుతుందన్నారు.
రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు ఉండనున్నాయని అన్నారు.
సీఎం కేసీఆర్ నేరుగా ఏ రైతుతోనైనా మాట్లాడే వెసులుబాటు, రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఉంటుందని, రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా అన్నదాతలకు అన్నివిధాలుగా ఉపయోగపడేలా అవసరమైతే గోదాంలుగా కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉందన్నారు.
ఎరువులు, విత్తనాలు, పరికరాలు వచ్చినప్పుడు వాటిని తాత్కాలికంగా భద్రపరిచేందుకు వీటిని ఉపయోగించుకోవొచ్చని అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, DCMS చైర్మన్ శేషగిరిరావు, అధికారుకు, నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సీతారామ జిల్లాకు వరప్రదాయని అన్నారు.
కొత్త ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నదని, ప్రస్తుతం కృష్ణ, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేస్తే... ఈ విషయం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానాకాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో గరిష్ఠంగా 23 లక్షల ఎకరాలకే నీటిని అందించారు. సాధారణంగా ప్రతీ ఏడాది నీటి లభ్యతను బట్టి 10-20 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ వచ్చారని, వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి కూడా 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చిన సందర్భం లేదన్నారు. అయితే ప్రస్తుతం ఒక్క వానాకాలంలోనే 41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరేండ్ల పరిపాలన విజయంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో గోదావరి నది మీద వడివడిగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అనేక జిల్లాలకు ఈ ఏడాది దండిగా నీరు అందనుందని, దీనికి తోడు పాలమూరు జిల్లాలో కృష్ణా నది మీద తెలంగాణ వచ్చినంక పూర్తిచేసిన ఎత్తిపోతలు కూడా భారీగా నీటిని అందించనున్నాయన్నారు.
2014-15 సంవత్సరంలో తెలంగాణలో వానాకాలం పంటకు కేవలం 9,73,072 ఎకరాలకు నీరు అందితే, నేడు అది 41,00,000 ఎకరాలకు చేరుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, అధికారులు, రైతులు ఉన్నారు.