సూర్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతువేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- వద్దన్నదాకా గోదావరి నీళ్లు
- గిట్టుబాటు ధర నిర్ణయించుకునే రోజు దగ్గరలోనే ఉంది
- రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు
- చెప్పింది చేసే వారిని మహాత్ములు అంటారు
- తెలంగాణ కు అటువంటి మహాత్ముడే ముఖ్యమంత్రి కేసీఆర్
- ఆత్మకూర్ యస్ మండల పరిధిలో ఇనాం భూములకు పట్టాలు
- పంపిణీ
- పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
అనంతరం ఆత్మకూర్ యస్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాతర్లపాడు, కందగట్ల గ్రామలకు చెందిన ఇనాం భూముల లబ్ధిదారులకు పట్టాలను మంజూరు చేపించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కొందరు కలలు గంటారు ... మరికొందరు పగటి కలలు కంటారు... తెలంగాణ వస్తది అని కలలు కన్న వారి కలలు సాకారమైందని.. పగటి కలలు గన్న వారికి మాత్రం ఇప్పుడు రాత్రిళ్ళు కలలు పడి ఆగమైతున్నారని ఎద్దేవా చేశారు. అందరూ అనుకున్నది అనుకున్నట్లు సాదించలేరని.. అలా సాదించగలిగిన వారిని మహాత్ముడు అని సంభోదించిన చరిత్ర మనకుందని.. ఆ మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.
ఉద్యమం మొదలు పెట్టిన 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఖాయమని.. వచ్చిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియమాకాలు ఏ విదంగా ఉండబోతున్నాయో ముందుగా వెల్లడించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పుకొచ్చారు. చెప్పింది చెప్పినట్లు జరిగింది కాబట్టే చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మహాత్ముడు అని సంబోధిస్తున్నారన్నారు. ముందుగా చెప్పిన తీరుగానే విద్యుత్ ను వద్దు అనే దాకా సరఫరా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఇప్పుడు సూర్యపేట జిల్లాలో గోదావరి జలాలు వద్దు అనే దాకా పరుగులు పెడుతాయన్నారు.
రైతును రాజును చేయాలన్న సంకల్పబలంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నందునే అసాధ్యం సుసాధ్యం అవుతోందన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, సాగుకు వద్దు అనే దాకా నీరు, పంట పండించుకునేందుకు ఎకరాకు సాలీనా 10 వేల రూపాయల పెట్టుబడి అర్దాంతరంగా రైతు మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు పరచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించుకునే రోజు రావాలన్న సంకల్పం బలంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
అందుకు అనుగుణంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతుందన్నారు. రైతు సమన్వయ సమితి ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అందుకు తోడు గా నిర్మించ తలపెట్టిన రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలుగా మారబోతోన్నాయన్నారు. ఇంకా ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, జడ్ పి టి సి లు బిక్షం, సంజీవ్ నాయక్, పెన్ పహాడ్ యంపిపి నెమ్మది బిక్షం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.