నిమ్స్ ఆసుపత్రిలో మొలిక్యులర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి ఈటల

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు, ప్రభుత్వాలని ఆరోగ్య విషయంలో మన స్థాయి ఏంటో తెలియజెప్పిన సమయం ఇది. ఆరోగ్య విషయంలో ప్రభుత్వాలు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని వేల కోట్లు అయిన సరే ఖర్చు పెట్టి  ప్రజలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించే లాగా వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నింటిలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

నిమ్స్  ఆసుపత్రిలో మొలిక్యులర్ ల్యాబ్ ను ఈ రోజు మంత్రి ప్రారంబించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ డా సత్యనారాయణ, డా గంగాధర్ తో పాటు పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారమెడీకల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి మంత్రి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హిస్పిటల్.. ఇక్కడ మూత్రపిండాలు, లీవర్, గుండె మార్పిడీ చేయడానికి చాలా పరీక్షలు అవసరం అవుతాయి. అవన్నీ చేయడానికి 6 కోట్ల రూపాయల వ్యయంతో  మొలిక్యులయర్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ను ఈ రోజు ప్రారంబించుకున్నాం. RT PCR MACHINE, ADVANCE MICRO SCOPE, Mr SPOT, FLOWCYTOMETRY, APHRESIS MACHINE, DNA SEQUENCING MACHINE, ELISA READERS,CELL CULTURE LABS,MACS COLUMNS తో కూడిన ల్యాబ్ ను ప్రారంబించారు.

కిడ్నీ, లీవర్, హార్ట్, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవసరం అయిన పరీక్షలు అన్నీ ఈ ల్యాబ్ లో చేయగలము. వీటితో పాటు కరోనా పరీక్షలు చేయడానికి దక్షిణ భారత దేశంలో మెదటి సారిగా ఏర్పాటు చేసిన కోబాస్ 8800 మిషన్ ను కూడా ప్రారంబించారు. రోజుకు నాలుగు వేల కరోనా పరీక్షలు చేయగల సామర్ధ్యం ఈ మిషన్ కి ఉంది. ఒకేసారి హెచ్ఐవి, టీబీ, కరోనా మూడింటికి సంబందించిన పరీక్షలు ఈ  మిషన్ ద్వారా చేయగలము.

కరోనా వల్ల ఆగిపోయిన అన్ని వైద్య సేవలు నిమ్స్ లో మొదలు పెడుతున్నాం అని మంత్రి ప్రకటించారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు  అన్నీ చేస్తాం అన్నారు. 15 రోజుల్లో నిమ్స్ పూర్తి స్థాయిలో పని చేస్తుంది. అతి త్వరలోనే కొత్త ఓపి బ్లాక్ నిర్మాణం కూడా మొదలుపెడతాం అని తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద  పనిచేస్తున్న శానిటేషన్, నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు పెంచుతాం అని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కరోనా పేషంట్లకు పూర్తి స్థాయులో చికిత్స అందిస్తున్నాం. జమ్మికుంట లాంటి ఆసుపత్రుల్లో కూడా కరోన చికిత్స అందించే స్థాయికి ఎదిగినం, కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి డబ్బులు తగులేసుకోవద్దు. అప్పుల పాలు కావద్దు. ఎన్ని వేల మందికి అయిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రేమను పంచి నయం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని మంత్రి మరోమారు తెలిపారు.

ఈ సందర్భం గా బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్న పలువురు పేషంట్లనుమంత్రి పలకరించారు. నలభై లక్షల రూపాయల ఖరీదైన చికిత్స ను ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందించడంపై వారందరూ మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం కి చెందిన 12 సంవత్సరాల వయసుగల కార్తీక్, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన 20 సంవత్సరాల వయసు గల జ్యోతి, ఖమ్మం జిల్లాకు చెందిన 25 సంవత్సరాలు వయసు గల ప్రశాంత్ లతో మంత్రి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

నిమ్స్ వివిధ విభాగాల్లో రోజులు పదివేల పరీక్షలు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ల్యాబ్స్ ను మరింత బలోపేతం చేయడానికి అవసరం అయిన నిధులు అందిస్తామని తెలిపారు. స్టెమ్ సెల్ ల్యాబ్ తో పాటు మరికొన్ని సదుపాయాల వచ్చే నెలలో ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.

More Press News