దంసలాపురం ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం ప్రజల చిరకాల కోరిక రూ.74కోట్లతో నిర్మిస్తున్న దంసలాపురం ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు వివరించారు. ఖమ్మం-బోనకల్ కు అనుసంధాన పనులను తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ప్యాచి పనులు రంగులు, మొక్కలు తదితర పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఈ దసరా నాటికి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నో ఎల్లనాటి కల సాకారం కానుందని మంత్రి పేర్కొన్నారు.
మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేస్తాం: మంత్రి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ YSR నగర్ కాలనీ, 11వ డివిజన్ మాణిక్య నగర్, 21వ డివిజన్ తుమ్మలగడ్డ, 20వ డివిజన్ జమ్మిబండ, 26వ డివిజన్ రమణగుట్ట, 27వ డివిజన్ రేవతి సెంటర్, 28వ డివిజన్ నిజం పేట, 34వ డివిజన్ దొరల కాలనీ(రమణగుట్ట), 46వ డివిజన్ గొల్లబజార్ లో మంత్రి పువ్వాడ గురువారం పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరూన్ పాస్ బుక్ పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించి చైతన్యం, అవగాహన కల్పించాలని స్థానిక కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలన్నారు.
అనంతరం స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో ప్రభుత్వ స్థలంలో ఇండ్ల కట్టుకుని నివాసం ఉంటున్న వారికి మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు.
సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు నగరాల్లో, గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి సూచించారు. కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాల ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. భూములకు భద్రత కల్పించడంతోపాటు, ఆయా భూ, ఇండ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నగరంలో ఇంటి నెంబర్, కరెంట్ బిల్ ఉన్న ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వగైరాలన్నీ రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ RV కర్ణన్ కి సూచించారు.
ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్రక్రియను ఓ ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహలుంటే తొలగించాలని చెప్పారు. కేవలం ఆయా నివాసాలు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు సహకరించి ఈ నమోదు ప్రక్రియ చేసుకోవాలన్నారు. దళారులు, ఇతరులెవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగుతుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలని మంత్రి సూచించారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది నాయకులు ఉన్నారు.
మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేస్తాం: మంత్రి