రేపు 100% రాయితీపై చేప పిల్లల సరఫరా కార్యక్రమన్ని ప్రారంభించనున్న మంత్రి తలసాని!

2019-20 సంవత్సరములో 100% రాయితీపై చేప పిల్లల సరఫరా కార్యక్రమం తేదీ 16.8.2019 న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ బ్యారేజ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి ప్రారంభించుచున్నారు. అదే విధంగా అన్ని జిల్లాలలో ఇట్టి కార్యక్రమము స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. చేప పిల్లల విడుదలను సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను జిల్లా అధికారులకు పంపించడమైనది. ఈ సంవత్సరంలో 24,953 నీటి వనరులలో 80.86 కోట్ల చేప పిల్లలను, 5 కోట్ల రొయ్య పిల్లలను 100% రాయితీతో వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

సంవత్సరంనీటి వనరుల సంఖ్యవిడుదల చేసిన చేప పిల్లల సంఖ్య (కొట్లలో)వ్యయం
(కొట్లలో)
2016-173,93927.8522.46
2017-1811,06751.0044.08
2018-1910,77249.1543.10
2019-20
(ప్రతిపాదించినది)
24,95380.86352.00

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత తొలిసారిగా 1.24 కోట్ల చేప పిల్లలు, 26 లక్షల రొయ్యల పిల్లలను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో విడుదల చేయాలని ప్రదిపాదించడమైనది.

More Press News