సిద్దిపేట శివారులో తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ తో... తెలంగాణలో 5 ఏళ్లలో 3.67 శాతం గ్రీన్ కవర్ పెంపు
  • స్థానిక సంస్థల బడ్జెట్ లో 10 శాతం నిధులను పచ్చదనం కోసం వెచ్చించిన తొలి రాష్ట్రం తెలంగాణ నే
  • మొక్కల పెంపకం ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి
  • మానసిక ఒత్తిడి నీ దూరం చేయడం, ఆరోగ్యం పెంపొందించడం లో మొక్కల ది కీలక పాత్ర
  • గ్రీన్ కవర్ పెరిగితేనే ప్రజలకు స్వచ్చమైన గాలి
  • మొక్కల పెంపకమే.. ..భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి
సిద్దిపేట: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లలో గ్రీన్ కవర్ 3.6 7 శాతం పెరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ కు హారిత హరం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే స్థానిక సంస్థల బడ్జెట్ లో ప్రత్యేకంగా పచ్చదనం పెంపు కోసం 10 శాతం బడ్జెట్ ను కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కిందని మంత్రి పేర్కొన్నారు.

సిద్దిపేట శివారులో రూ.4.5 కోట్ల వ్యయంతో 500 ఎకరాలలో సిద్దిపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదం, మానసిక ఉల్లాసం కోసం నిర్మించిన ‘తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు నిత్యం కాలుష్యంతో సతమతమవుతూ మానసిక ఒత్తిడి అనారోగ్యం బారిన పడుతున్నందున వారికి ఆహ్లాదకరమైన, ఉల్లాస కరమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం తెలంగాణలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకూ తెలంగాణ లో 109 చోట్ల అర్బన్ పార్కులు ఏర్పాటుకు పనులు ప్రారంభించగా 34 అర్బన్ పార్కులను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించుకునున్నా మన్నారు. సిద్దిపేట అర్బన్ పార్క్ 35వదని మంత్రి తెలిపారు.

ఐదు వందల ఎకరాల పైగా స్థలంలో ఏర్పాటు చేసిన ఈ అర్బన్ పార్కులో 100 ఎకరాలను ఆక్సిజన్ పార్క్ కోసం ప్రత్యేకంగా కేటాయించమని మంత్రి తెలిపారు. పార్కులో సందర్శకుల కోసం ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. సైక్లింగ్ ట్రాక్, వాకింగ్, యోగ , ధ్యానం కు పార్క్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో సాహస క్రీడలు ను కూడ పార్క్ లో ఏర్పాటు చేస్తామన్నారు. జింకలు, పైథాన్ లు, కుందేళ్ళు పక్షులు, వలస పక్షులు వంటి వన్య ప్రాణులు పార్క్ లో చూడవచ్చు నన్నారు. వచ్చే నెల రోజుల్లో మూషిక జింకల ను సైతం పార్క్ లో ఉండేలా చూస్తామన్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఓపెన్ లైబ్రరీ నీ జిల్లా గ్రంధాలయ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేస్తామన్నారు.

మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లే మంత్రి అన్నారు. అడవుల ప్రాధాన్యత ను గుర్తించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవుల పునరుద్ధరణ చేపట్టి, పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అడవుల పునరుద్ధరణ కార్యక్రమం గజ్వేల్ నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడు తున్నారని తెలిపారు. తెలంగాణ లోని గ్రామ గ్రామాన నర్సరీ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పట్టణంలో జనాభాకు అనుగుణంగా పదుల సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.

పచ్చదనానికి ప్రభుత్వం స్థానిక సంస్థల బడ్జెట్‌లో పదిశాతం నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లేనని, ఆస్తులు ఇచ్చినా నిలుపుకుంటారో లేదో తెలియదన్నారు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చని, కానీ ఆరోగ్యం పోతే తిరిగి రాదన్నారు. మంచి పర్యావరణంతోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించే హరితహారం, సామాజిక అడవుల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల లో ప్రజలందరూ సామాజిక బాధ్యత గా భావించి క్రియాశీలక భాగస్వామ్యం కావాలన్నారు.

సిద్దిపేట పట్టణం జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యార్థులు అర్బన్ పార్క్ ను సందర్శించే లా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పర్యావరణ ప్రాధాన్యత, పరిరక్షణ , జీవ వైవిధ్యం, అడవుల పునరుద్ధరణ పై క్షేత్ర పరిశీలన ద్వారా అవగాహన కల్పించా లన్నారు.

వన భోజనాలకు కూడ అర్బన్ పార్క్ లు చక్కని ఫలితాలు లుగా ఉపయోగ పడతాయన్నారు. పట్టణ ప్రజలు అర్బన్ పార్క్ ను సద్వినియోగం చేసుకోవాలనీ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు.

పార్కు ప్రారంభోత్సవంలో అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ,  అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

More Press News