సూర్యాపేట చివరి భూములకూ.. కాళేశ్వరం జలాలు అందాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సాగునీటిశాఖ అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట జిల్లాలో కొన్నిచోట్ల కాల్వ చివరి భూములకు సరిపడా నీరందించాలని రైతులు కోరుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలన్నారు. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం నుండి డీబీఎం -71 పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని కాల్వ చివరి భూములకు సరిపడా కాళేశ్వరం జలాలను అందించాలని ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.శంకర్ ను సీఎం ఫోన్లో ఆదేశించారు.