మట్టి గణేషుడిని పూజించండి - పర్యావరణాన్ని రక్షించండి!

తెలంగాణ రాష్ట్రములో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి 'నేషనల్ గ్రీన్ కార్ప్, లీ శ్రేయస్ ఫౌండేషన్ సంస్థ, ద్రువాన్ష్ ఎన్జీఓ'లతో కలసి పర్యావరణానికి హానికారకము కానటువంటి వినాయకుని విగ్రహాలు సిద్దపరిచి వాడకము గురించి, మండలి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగించుటకై వర్క్ షాప్లు, సెమినార్లు ఏర్పాటు చేయుటకై ప్రణాళిక చేసుకున్నది. మండలి పర్యావరణమునకు హితకరముగా నిల్వ ఉండే నీటి ప్రాంతాలలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటుకై కృషి చేస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుని విగ్రహాలు తరచుగా హానికరమైన రంగులు, మెర్క్యూరీ తదితర విషతుల్యమైన రసాయన పదార్థాలచే పర్యావరణమునకు హాని కలిగించే విధంగా సిద్దపరిచి వాటిని తిరిగి నీటిలో వేయడం ద్వారా నీటి ప్రాంతాలు పర్యావరణానికి హానికారకముగా అవుతున్నవి. కావున మట్టి గణేశుని విగ్రహాల తయారీ, వాడకము శ్రేష్ఠమైనందున తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు సిద్దమైనది.

తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ద్వారా గణేశుని పూజలో వాడే 21 రకాల ఆకులు, పూలు, కాయలు ఆయుర్వేదపరంగా విలువైనవి వాడునట్లు విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగించుటకై వర్క్ షాప్లు, సెమినార్లు ఏర్పాట్లు గురించి చర్యలు గైకొన్నది. దానికి అనుగుణoగా, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయలలో, కాలేజీలో, పాఠశాలలో జీవవైవిధ్యం, దాని యొక్క రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.


More Press News