రాజీవ్ గాంధీ పార్క్ నందలి ఆధునికీకరణ పనులు వేగవంతము చేయాలి:వీఎంసీ క‌మిష‌న‌ర్

  • దసరా నాటికీ  పూర్తి స్థాయిలో సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులో 
విజయవాడ: రాజీవ్ గాంధీ పార్కు నందలి అభివృద్ధి పనుల యొక్క పురోగతిని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ సంబందిత అధికారుల‌తో కలసి పర్యవేక్షించి చేపట్టిన అన్ని పనులు వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వ‌ర్క్ ప‌నులను పరిశీలిస్తూ, వాకింగ్ ట్రాక్ నందు గల గ్యాప్స్ పూర్తి చేయుటతో పాటుగా పాత్ వే నందు గ్రావెల్ వేయాలని అన్నారు. పార్క్ నందు ఏర్పటు చేయనున్న గెజిబో నిర్మాణం, ప్లాజా ప్లాంటరీ బాక్స్ మొదలగు అన్ని పనులు కూడా వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. పార్క్ ఆవరణలో ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుట, పిచ్చి మొక్కలు తొలగించుట మరియు పాడైన మొక్కలు స్థానములో కొత్త మొక్కలు ఏర్పాటు చేసి పార్క్ ను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అన్నారు.

పార్క్ ఆవరణలో పి.పి పద్దతిలో చిన్నారుల కోసం మ‌ల్టీ ప్టే గ్రేమ్స్, పిల్ల‌ల పార్క్ మొదలగు పనులు వెంటనే చేపటి పూర్తి చేయాలని, ఓపెన్ మ్యూజిక్ ఫౌంటెన్, వంతెన, టాయిలెట్స్ మొదలగు వాటికీ తగిన మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నందలి అని పనులు చేపట్టి యుద్దప్రాతిపదికన పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో పార్క్ ప్రారంభించుటకు సిద్దంగా ఉంచి దసరా నాటికీ పూర్తి స్థాయిలో  సందర్శకులకు పార్క్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి.వి.కె భాస్కరరావు, ఉద్యానవన శాఖాదికారి జె.జ్యోతి మరియు డిప్యూటీ ఇంజనీర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

More Press News