జాతీయ స్థాయిలో తెలంగాణకు అరుదైన గౌరవం!

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం అరుదైన రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్న తెలంగాణ పర్యాటక శాఖ
  • గత 4 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వరసగా వివిధ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక పురస్కారాలను అందుకుంటుంది
1. తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకులకు పర్యటన ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం కోసం రూపొందించిన "ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ" అనే మొబైల్ యాప్ కు,
2. ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగంలో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికిలకు జాతీయ స్థాయి పర్యాటక అవార్డులను గెలుచుకున్నాయి.

" ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ" అనే మొబైల్ యాప్ కు ఐటీ యొక్క అత్యంత విన్నూత్న ఉపయోగం - సోషల్ మీడియా/మొబైల్ అనువర్తనం, వెబ్ సైట్ విభాగంలో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన యాప్ కు అందరి ప్రశంసలతో పాటు అరుదైన అవార్డును గెలుచుకుంది. భారతదేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి గా, ప్రైవేట్ హెల్త్ కేర్ విప్లవానికి మార్గదర్శకత్వం వహించిన అపోలో ఆసుపత్రికి ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగాలలో అవార్డును తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇండియా టూరిజం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డులను
తెలంగాణ పర్యాటక శాఖ గెలుచుకుంది.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగంగా ఇండియా టూరిజం ఆధ్వర్యంలో న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, UNWTO సెక్రెటరీ జనరల్ జురాబ్ పొలాలికశవిలి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ల చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డును స్వీకరించారు. 

More Press News