అనీసుల్ గుర్భా నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయండి: మంత్రి కొప్పుల ఈశ్వర్

  • మొదటి దశ పనులను రంజాన్ నాటికి పూర్తి చేయండి
హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భాను సందర్శించి, సమీక్షించారు. సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడారు.

మంత్రి కొప్పుల కామెంట్స్:
  • అనాధ బాలబాలికలకు ఆశ్రయం కల్పించే ఈ భవన నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయండి
  • నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ఆశ్రమానికి అధునాతన భవనాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 39 కోట్లు మంజూరు చేశారు
  • ఇందుకు సంబంధించిన పనులు కరోనా వైరస్ కారణంగా కొంత ఆలస్యం జరిగింది
  • ఈ భవనం మొదటి దశ నిర్మాణం పనులు రంజాన్ నాటికి పూర్తి చేయండి
  • మిగతా పనులను ఆ తర్వాత రెండు నెలలో పూర్తి చేయండి
  • ఈ ఆశ్రమానికి సంబంధించి బజార్ ఘాట్, గన్ ఫౌండ్రీ తదితర చోట్ల ఉన్న ఆస్తులను పరిరక్షించండి
  • 300 మంది చొప్పున మొత్తం 600 మంది బాలబాలికలకు ఈ ఆశ్రమం వసతి కల్పిస్తున్నది
  • వీరికి మంచి వసతితో పాటు పోషకాహారాన్ని అందించండి, వారి ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల తగు శ్రద్ధ వహించండి
  • ఇందులో అంగన్ వాడీతో పాటు బస్తీ దవాఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
  • ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో తరగతులు నిర్వహించండి
  • ఆ తర్వాత వారిని మైనారిటీ గురుకుల పాఠశాలలో చేర్పించండి
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కొప్పుల, ఒవైసీ పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.

అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మన గురుకులాలు దేశానికే దిక్సూచి: మంత్రి కొప్పుల ఈశ్వర్మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంగళవారం ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఎంబిబిఎస్, ఐఐటిల్లో చదువుతున్న 151మందికి ల్యాప్ టాప్స్, 196 మందికి 50వేల చొప్పున, క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన 11మందికి  నగదు పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమంలో ఐఎఎస్ అధికారులు రాహూల్ బొజ్జ, విజయ్ కుమార్, యోగితారాణ, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అధికారులు వర్షిణి, హన్మంతు నాయక్, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కామెంట్స్:
  • తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజ్ఞానవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారు
  • ముఖ్యమంత్రి కలల మేరకు ఇవి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ, దేశానికి,ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి
  • మారుమూల ప్రాంతాలు,పేద వర్గాల నుంచి వచ్చిన బాలబాలికలు చక్కగా చదువుతున్నారు,ఆత్మ విశ్వాసం,స్థైర్యంతో ముందుకు సాగుతుండడం సంతోషంగా ఉంది
  • విద్యతో పాటు అన్ని అంశాలలో గొప్పగా రాణిస్తుండడంతో ముఖ్యమంత్రి కూడా సంతృప్తిగా ఉన్నారు
  • వీరిని జీవితంలో గొప్పగా స్థిరపడే విధంగా తీర్చిదిద్దుతున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు
తమ సామాజిక సేవలో భాగంగా ఈ విద్యార్థులకు ల్యాప్ టాప్స్ అందించిన స్ట్రీట్ సాఫ్ట్ వేర్ కంపెనీని మంత్రి అభినందించారు.

More Press News