వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు
డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ప్లాంట్ నందలి 5 యం.జి.డి, 11 యం.జి.డి 8 యం.జి.డి ఫిల్టరైజేషన్ ప్లాంట్లు పనితీరు, వాటర్ ఫిల్టర్ ప్లాంట్ల యొక్క నిర్వహణ విధానం, ఇన్ టెక్ వెల్ ద్వారా రా వాటర్ సేకరణ మరియు 11 యం.జి.డి ఇన్ టెక్ వెల్ ద్వారా నీటి సేకరణ శుద్ధి చేయు విధానం మరియు స్కాడా పనితీరు, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్ విధానం మరియు రా-వాటర్ శుద్ధి చేసిన తదుపరి నీటిలో గల టేర్భిటి శాతం ఎంత పరిమాణంలో ఉన్నది మరియు క్లోరినేషన్ ఎంత పరిమాణంలో కలుపుతున్నది, అమలులో ఉన్న 24/7 మంచినీటి సరఫరా విధానంను రిజర్వాయర్లకు రక్షిత నీటిని సరఫరా చేయు విధానం, వాటర్ వేస్ట్ జ్ మొదలగు అన్ని అంశాలను క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వేసవిలో ప్రజలకు ఏవిధమైన నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ, వాటర్ పైప్ లైన్ లలో గుర్తించిన లికేజిలకు యుద్దప్రతిపదికన తగిన మరమ్మతులు చేపట్టి త్రాగునీరు వృధా కాకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
4 వ డివిజన్ గుణదల లో హరిజనవాడ రోడ్డు, ఫిలింకాలనీ, మొదలగు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ విధానం మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల తీరును పరిశీలిస్తూ, స్థానిక ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలలో ఎదురౌతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. స్థానికులను చెత్త సేకరణకు మరియు కాలువలు శుభ్రపరచుటకు సిబ్బంది సక్రమముగా వస్తున్నది లేనిది, త్రాగునీటి సరఫరా విధానం మొదలగు అంశాలను అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేస్తూ, కొండ ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానంను అమలు చేయాలని ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతములోని మెట్ల మార్గం మరియు ఖాళి ప్రదేశాలలో ఎవరు చెత్త మరియు వ్యర్ధాలు పడవేయకుండా చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత శానిటరీ అధికారులపై ఉందని, ఏ విధమైన చెత్త లేదా వ్యర్దములు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, ఏహెల్త్ ఆఫీసర్ డా.బి. శ్రీదేవి, శానిటరీ సూపర్ వైజర్ సలీం మహమ్మద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.