దేశ భక్తిని పెంపొందించేలా కార్యక్రమంల రూపకల్పన చేయుట అభినందనీయం: వెల్లంపలి

  • ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో మాజీ మంత్రివర్యులు వెల్లంపలి శ్రీనివాస్
  • ఉత్సాహంగా గాంధీ కొండపై హెరిటేజ్ వాక్
విజ‌య‌వాడ‌: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా గాంధీ కొండపై గురువారం నిర్వహించిన హెరిటేజ్ వాక్ కార్యక్రమములో మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, గ్రందాలయ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ పలువురు కర్పోరటర్లు అధికారులు పాల్గొన్నారు. ముందుగా ప్లానిటేరియం నందు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ప్రారంభించారు. తదుపరి హెరిటేజ్ వాక్ ను ప్రారంభించి విద్యార్ధులతో కలసి కాలి నడకన కొండపై గల మహాత్మాగాంధీ స్థూపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జండాను ఆవిష్కరించారు. తదుపరి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించిన వాల్ పెయింటింగ్, వ్యాస రచన, క్విజ్ తదితర పోటిలలో విజేతలకు ప్రసంశా పత్రములు అందజేసారు.

ఈ సందర్బంలో శాసన సభ్యులు వేలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశాన్నికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు విజయవాడ నగరపాలక సంస్థ అనేక కార్యక్రమములను ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని, దానిలో భాగంగా నేడు గాంధీ కొండపై హెరిటేజ్ వాక్ కార్యక్రమము నిర్వహించడం జరిగినదని పేర్కొన్నారు. స్వాతంత్రం సాధనలో పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకొంటు,  ప్రతి ఒక్కరి దేశ భక్తి పెంపొందించే విధంగా ఎంతో చరిత్ర కలిగిన ఈ గాంధీ కొండ చుట్టూ తిరిగే ట్రైన్,  నక్షత్ర శాల, గ్రంధాలయo, లైటింగ్ సౌండ్ సిస్టం, పిల్లలకు ఆకర్షనియంగా ఉండేలా అట పరికరాలతో గాంధీ పర్వతం ఒక టూరిస్ట్ ప్రదేశముగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగినదని, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోని దీనిని అభివృద్ధి చేయడం జరిగినది అన్నారు.

అదే విధంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ది.01-08-2022 నుండి ప్రతి రోజు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములను నిర్వహించి నగరంలో గల చరిత్మతకమైన గాంధీ కొండ నేటితరం చిన్నారులు తెలుసుకొనే విధంగా హెరిటేజ్ వాక్ పోగ్రామ్ ఏర్పాటు చేసి దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఉంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అదే విధంగా 13వ తేది నుండి 15వ తేది వరకు హర్ గర్ తిరంగ్ కార్యక్రమము ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జండా వేయు కార్యక్రమము నిర్వహించుట జరుగుతుందని, ప్రజలందరూ విధిగా తమ యొక్క ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం జండాలను అందించుట జరుగుతుందని అన్నారు.

తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినందున ప్రజలలో దేశ భక్తిని పెంపొందించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్రం సాధనలో పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకోని ఆనాటి త్యాగముర్తులను మననం చేసుకొని విద్యార్ధులలో స్వాతంత్ర్యం స్పూర్తిని నింపి నాయకుల మరియు వివిధ చరిత్మతకమైన సంఘటనల పట్ల అవగాహనా కల్పించుటకు ఈ విధమైన కార్యక్రమము రూపకల్పన చేయుట సంతోషకరమని అన్నారు. అదే విధంగా ఆగష్టు  13 నుండి 15వ  తేది వరకు నగరంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం జాతీయ జండాను ఎగురవేసి ప్రతి ఒక్కరు  జాతీయ స్పూర్తితో విజయవంతము చేయాలని అన్నారు.

కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లులతో పాటుగా అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, మరియు ఇతర అధికారులు సిబ్బంది హాజరుకాగా వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు ఎన్.సి.సి విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా జాతీయ జండాలతో  హెరిటేజ్ వాక్ పాల్గొన్నారు.

More Press News