నెదర్లాండ్స్ లోని సీడ్ వ్యాలీ హాలండ్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి!

  • విత్తనోత్పత్తిలో కొత్త అధ్యాయం 

  • తెలంగాణలో అంతర్జాతీయ విత్తన సలహా మండలి

  • యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో మరింత ప్రోత్సాహం

  • కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎదిగింది

   -   తెలంగాణ అంతర్జాతీయ విత్తన భాండాగారంగా ఎదిగేందుకు చర్యలు
  -   వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కూరగాయల విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు
  - ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల విలువ ఉన్న అంతర్జాతీయ విత్తన మార్కెట్ 2025 నాటికి రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా
  - అంతర్జాతీయ విత్తన మార్కెట్ లో  2017 సంవత్సరంలో 3.6 బిలియన్ డాలర్లు, 2018 లో 4.1 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉన్న భారత్  2024 సంవత్సరానికి 9.1 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
  - అంతర్జాతీయ విత్తన చట్టాలు, నిబందనలు మరియు ప్రమాణాలకు, భారత విత్తన చట్టాలు, విత్తన నాణ్యత, విత్తన పరీక్షలలో వ్యత్యాసం ఉంది
 -  దాని మూలంగా అంతర్జాతీయ విత్తన వాణిజ్యంలో భారత వాటా 2 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యం ఉంది
 - తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా, పర్యావరణ రీత్యా ప్రపంచంలో విత్తన ఉత్పత్తికి అనుకూలమైన అతికొద్ది ప్రాంతాలలో ఒకటి
 -   తెలంగాణలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించడం మూలంగా అంతర్జాతీయ విత్తన విపణిలో కీలకంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి
- తెలంగాణ లో ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్ లో, అంతర్జాతీయ విత్తన సలహా మండలి, రైతులకు అంతర్జాతీయ విత్తన నైపుణ్య శిక్షణ కేంద్రo ఏర్పాటు చేసి తెలంగాణతో  అంతర్జాతీయ విత్తన సంబంధాలను మెరుగుపరచి  విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తాం
  - తెలంగాణ ప్రస్తుతం దేశానికి అవసరమయిన విత్తనాలలో 60 శాతం సరఫరా చేస్తుంది
   - నైపుణ్యం కలిగిన రైతులు, అనుకూలమయిన వాతావరణం ఇక్కడ ఉన్నందున ఇప్పటికే 400 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇక్కడ ఉన్నాయి
  - తెలంగాణ లో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి యూరప్ దేశాలతో పాటు, సౌత్-ఈస్ట్ ఆసియన్ దేశాలైన వియాత్నం, కంబోడియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ దేశాలకు విత్తన ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ విత్తన సలహా మండలి ఏర్పాటుకు సన్నాహాలు
 -    జర్మనీ, నెదర్లాండ్స్ పర్యటనలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదికారులతో, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులతో తెలంగాణ లో ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విత్తన సలహా మండలి గురించి చర్చించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
 - రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం ప్రకారం తెలంగాణ ను గ్లోబల్ సీడ్ హబ్ గా తీర్చిద్దడం లో ఈ అంతర్జాతీయ విత్తన సలహా మండలి కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు
  - జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదికారులతో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ విత్తన నెట్వర్కింగ్ పై చర్చించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. దేశాల మద్య విత్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నాణ్యమైన విత్తనోత్పత్తి మెలకువలను పరస్పర మార్పిడి చేసుకోడానికి ఈ అంతర్జాతీయ విత్తన నెట్వర్కింగ్ ఉపయోగపడుతుందని ఆశాభావం
 -  హైదరాబాద్ సమీపంలోని బండమైలారంలో 150 ఎకరాలలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనే ఉద్యెశంతో జర్మనీ లోని ప్రసిద్ది గాంచిన విత్తన వ్యాలీ లో ఉన్న విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ సౌకర్యాల పరిశీలన
 - ఇక్కడ ఏర్పాటు చేసే పార్క్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన పరిశోధన సంస్థలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, అదునాతన విత్తన పరీక్ష ల్యాబ్ లు, శీతల గిడ్డoగులు, గోదాములు, ట్రైనింగ్ సెంటర్లు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు ఒకే ప్రదేశంలో ఉండేలా చర్యలు
  -  ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్ట్ ద్వారా, జర్మన్ ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు జర్మనీలో పర్యటిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి బృందం
  -   జర్మనీలో బెర్లిన్, బోన్న నగరాల పరిధిలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వ్యవసాయ క్షేత్రాలు, విత్తన కంపెనీలు, విత్తనోత్పత్తి క్షేత్రాలను సందర్శిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి గారు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు గారు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు గారు  
-  తెలంగాణ ప్రభుత్వం విత్తన రంగ  అభివృద్ధికి  తీసుకుంటున్న చర్యలకు జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇండో    - జర్మన్ ప్రాజెక్టు ద్వారా సంపూర్ణ సహకారాన్ని, సాంకేతిక  పరిజ్ఞానాన్ని అందించాలని కోరిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
   -  విత్తనరంగంలో వినూత్న మార్పులను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విత్తన పాలసీ, అంతర్జాతీయ విత్తన సలహామండలి, రాష్ట్ర విత్తన కౌన్సిల్. OECD అంతర్జాతీయ విత్తన దృవీకరణకు  మరింత ప్రోత్సాహం, విత్తన ప్రాసెసింగ్ లో ఆదునిక యంత్రాలు, పరికరాల ఉపయోగం, విత్తన పరీక్ష ల్యాబ్ లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు పరచడం, అంతర్జాతీయ ప్రముఖులచే విత్తనోత్పత్తి, విత్తన దృవీకరణపై శిక్షణ వర్క్ షాప్ లు నిర్వహించడం చేస్తామని మంత్రి గారు తెలిపారు
- నెదర్లాండ్స్ లో సీడ్ వ్యాలీ హాలండ్ ను సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. అంతర్జాతీయంగా ముఖ్యమయిన 40 విత్తన సంస్థల విత్తనోత్పత్తి, మొక్కల పెంపకం, ప్రాసెసింగ్ ప్రధానకేంద్రం
- ప్రపంచవ్యాప్తంగా 69 కేంద్రాలలో 35 దేశాలలో 1.3 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించిన సీడ్ వ్యాలీ సంస్థలు
- ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాలలో అన్నిరకాల వాతావరణాలకు అనుకూలించే ఉత్పత్తులతో విత్తనవ్యాలీలో 3 వేల మంది ఉద్యోగులతో, ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది ఉద్యోగులతో 35 దేశాలలో ప్రపంచ మార్కెట్ లో సేవలు అందిస్తున్న విత్తన వ్యాలీ సంస్థలు.


More Press News