అద్బుతమైన నిర్మాణం కాళేశ్వరం: గవర్నర్  తమిళి సై సౌందర రాజన్

పెద్దపల్లి , డిసెంబర్ 11:- రైతులకు సాగునీరందించేందుకు ప్రభుత్వం నిర్మించిన అద్బుతమైన సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మారం మండలంలో ప్యాకేజి 6 కింద నిర్మించిన నంది పంప్ హౌజ్ ను గవర్నర్ దంపతులు బుధవారం పరిశిలించారు. నంది పంప్ హౌజ్ లో భాగంగా నిర్మించిన సర్జపూల్, పంప్ హౌజ్ పనులను, విద్యుత్ సబ్ స్టేషన్ పనులను గవర్నర్ పరిశీలించారు. నంది పంప్ హౌజ్ పనితీరును కాళేశ్వరం ప్రాజేక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు గవర్నర్ కు వివరించారు. నంది పంప్ హౌజ్ లో 7 పంపులు, మోటార్లను ఎర్పాటు చేసామని, అన్ని పంపుల పరీక్షలు నిర్వహించామని, విజయవంతంగా అన్నీ పంపులు నడుస్తున్నాయని, ప్రతి రోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసే సామర్థ్యం నంది పంప్ హౌజ్ కు ఉందని తెలిపారు. నంది పంప్ హౌజ్ ద్వారా నీటిని గాయత్రి పంప్ హౌజ్ కు తరలించడం జరుగుతుందని ఈ ఎన్సీ వివరించారు. గుట్ట పై గల నీటి డెలివరి సిస్టం వద్దకు చేరుకుని మేడారం రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ చేసే విధానాన్ని గవర్నర్ పరిశీలించారు. అనంతరం గవర్నర్ ప్రజలకు , రైతులకు ఉపయోగపడే సాగునీటి ప్రాజేక్టు తక్కువ సమయంలో పూర్తి కావడం అభినందనీయమని, ప్రజల కోసం నిర్మించిన ప్రాజెక్టు విజయవంతమవుతూ సత్పలితాలివ్వడం సంతోషకరమని అన్నారు. విద్యుత్ సరఫరా కోసం ఎర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటడ్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు. సాగునీటి ప్రాజేక్టుల వల్ల ప్రజల అవసరాలకు నీరు అందుబాటులో ఉంటుందని, నీటి వల్ల భుగర్భ జలాలు కుడా పెరుగుతాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేసారు.

గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మెహన్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన , కాళేశ్వరం ప్రాజేక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు,జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి, పెద్దపల్లి ఆర్డిఒ ఉపెందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు.
 

More Press News