సర్థార్ పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోట మైనింగ్ లీజులను రద్దు చేసిన కేసీఆర్

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలోని సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటల సముదాయంపై ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన  మైనింగ్ లీజును రద్దు చేస్తూ రాష్ట్ర మైనింగ్ డిపార్టుమెంట్ ఇచ్చిన ప్రోసిడింగ్స్ నెం 345717/R1-3/2019-2, Date. 03.07.2019పై రాష్ట్ర గౌడ ఐక్య సంఘాల నేతలు సచివాలయంలో రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ను కలసి ధన్యవాదాలు తెలిపారు. ఐక్యగౌడ సంఘాల నేతలు చేసిన విజ్జ్ఞప్తితో పాటు స్థానిక గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక శాసన సభ్యులు సతీష్ కుమార్ ల విజ్జప్తి మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తక్షణం స్పందించి సర్థార్ పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోట మైనింగ్ లీజులను రద్దు చేసారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ సంఘం ప్రతినిధులకు వివరించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 32 కోటలు నిర్మించి గోల్కోండ కోటను జయించిన సర్థార్ పాపన్న చారిత్రను కాపాడి భవిష్యత్ తరాలకు అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ సర్థార్ పాపన్న నిర్మించిన చారిత్రక కోటలు భువనగిరి, ఖిలాషా పూర్, జాఫర్ ఘడ్ లకు నిధులు కేటాయించి పర్యాటకంగా అభివృద్ది చేసారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. కరీంనగర్ లోని సర్వాయిపేట కోట అభివృద్ది పై గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి కి తీసుకెళ్ళి వారి అదేశాల మేరకు అభివృద్ది చేస్తామన్నారు.

గౌడ ఐక్య సంఘం నేతల చేసిన  విజ్జ్ఞప్తి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం , రాష్ట్ర పురావస్తూ శాఖ డెరెక్టర్ దినకర్ బాబు లతో సమావేశం నిర్వహించి సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన సర్వాయి పేట కోట పై మైనింగ్ శాఖ అధికారులు  ఇచ్చిన లీజుల రద్దు పై చర్చించారు. పర్యాటకంగా అభివృద్ది పై గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి కోట అభివృద్ది ని తీసికెళ్లి సి యం కెసిఆర్ అదేశాల మెరకు నిధులు కెటాయించి అభివృద్ది చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
 
రాష్ట్ర అబ్కారి, క్రీడా, పురావస్తూ , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు సచివాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన ఐక్య సంఘాలు నాయకులు అంబాల నారాయణ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు, పెంటయ్య గౌడ్, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గౌరవ అద్యక్షులు, కలర్ సత్తన్న , సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అద్యక్షులు, రవిగారి ప్రసాద్ గౌడ్ , మోకు దెబ్బ రాష్ట్ర ఉపాద్యక్షులు , బబ్బూరి బిక్షపతి గౌడ్ , గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ఉపాద్యాక్షులు, సింగం సత్తయ్య గౌడ్, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం , బూడిద నర్సయ్య గౌడ్ , గౌడ ఐక్య సాధన సమితి జనగామ జిల్లా అద్యక్షులు, తాళ్లపల్లి వీరాస్వామి గౌడ్ , గౌడ ఐక్య సాధన సమితి జనగామ జిల్లా ఉపాద్యాక్షులు, కోండాపురం బాలారాజ్ గౌడ్ , మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వారిలో ఉన్నారు.

అనంతరం సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోటలు, చెరువులు, చారిత్రక ప్రాంతాల సంరక్షణకు మైనింగ్ శాఖ ఇచ్చిన అదేశాలను రద్దు చేసినందుకుసచివాలయంలో గౌడ ఐక్య సంఘం నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.  

More Press News