ఎన్ఎస్పీ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లు: కేసీఆర్

మిర్యాలగూడ డివిజన్ లోని ఎన్.ఎస్.పి ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అత్యంత ముఖ్య శాఖగా మారుతుందని, కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్విభజించాలని, పునర్వ్యవస్థీకరించాలని కోరారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

More Press News