జూలై 7న పాన్ ఇండియా స్థాయిలో UFO మూవీస్ ద్వారా ఓసాథియా మూవీ రిలీజ్
ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై
తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.
ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థ ఏ.పి, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జి.లక్ష్మణ్ అని చెప్పారు. లక్ష్మణ్ గారు ‘ఓ సాథియా’ సినిమా చూసి హీరో హీరోయిన్ బాగా చేశారని, మూవీ డైరెక్షన్ బాగుందని చెప్పారని తెలిపారు. ఈ సినిమా కి పాటలు బ్యాక్ బోన్ అని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చినట్లు నిర్మాత సుభాష్ చెప్పారు.
ఇటువంటి సినిమాలో కంటెంటే బలం అని నమ్ముతున్నాను అని చెప్పిన నిర్మాత సుభాష్.. తమ ఓ సాథియా చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నందుకు గాను UFO మూవీస్ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు.
ఈ చిత్రానికి డిఓపి– ఈ.జె.వేణు, ఎడిటర్– కార్తీక్ కట్స్, సంగీతం– విన్నూ, లిరిక్స్– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల, కొరియోగ్రఫీ– రఘు, బాబా భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్– చంద్ర తివారి, లైన్ ప్రొడ్యూసర్– వంశీకృష్ణ జూలూరి, పీఆర్ఓ౼ సాయి సతీష్.