తెలుగులో తీర్పు పై అధికార భాష సంఘం అభినందన

హైదరాబాద్, జూలై 1 :: తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పును తొలిసారిమాతృభాష తెలుగులో వెలువరించి నూతన అధ్యాయాన్ని ఆవిష్కరింపజేయడం అత్యంత ముదావహమని రాష్ట్ర అధికార బాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు. తెలంగాణా హైకోర్టు లో మొదటిసారిగా తీర్పును తెలుగులో ప్రకటించడం పై ఆమె స్పందించారు. దీనితో, భాషాభిమానుల అవధుల్లేని ఆనందానికి హేతువు అని పేర్కొన్నారు..

       ఈ నిర్ణయం, క్రొత్త ఒరవడికి శ్రీకారమని, ఇదో భాషాభ్యుదయపు స్వప్న సాకారమన్నారు.

ఈ విలక్షణ  సంప్రదాయాన్ని ఇదే రీతిగా న్యాయస్థాన కార్యాలయ నిత్య వ్యవహారాల్లోనూ, తీర్పుల్లోనూ కొనసాగిస్తూ ఇతర ప్రభుత్వ రంగ కార్యాలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు మార్గదర్శకం కావాలని శ్రీదేవి ఆకాంక్షించారు.  తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం ఉన్నత న్యాయస్థానాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.


More Press News