సోషల్ మీడియా - మహిళలపై దాడి అంశం పై రేపు మహిళా కమిషన్ సెమినార్
సభ్యసమాజం తలదించుకునే విధంగా సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న నీచమైన దాడిని ఖండిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం (5 తేదీ ) ఉదయం 10 గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురం లో సెమినార్ నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ ప్రకటనలో తెలిపారు.
మహిళా నాయకులు, సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా ధోరణి హద్దులు దాటుతుందని వీటిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలపై కూడా సోషల్ మీడియా ఉన్మాదంగా వ్యవహరించటం, ఈ హీనమైన ప్రచారంలో మహిళలు కూడా భాగస్వాములు కావటం బాధాకరమన్నారు. అన్ని వర్గాల మహిళలు సోషల్ మీడియా బాధితులుగా మారుతున్న పరిస్థితిపై అందరూ స్పందించాలని మహిళా కమిషన్ కోరుతుంది. ఈ సెమినార్ లో తమ అభిప్రాయాలు, సూచనలు తెలుపవలసిందిగా వివిధ మహిళా సంస్థలను, అధికారులను, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లను, డ్వాక్రా సంఘాలను కమిషన్ ఈ సెమినార్ కు ఆహ్వానించినట్లు తెలిపారు.