తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “మన వారసత్వ సంపద” ఘనవిజయం.
డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ సాహిత్యవిభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” నెల నెలా తెలుగు వెలుగు లో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో ఆదివారం, జులై 30 న నిర్వహించిన ఎందరో మహానుభావుల వారసులు పాల్గొన్న “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది.
తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన యింతమంది పండితుల వారసులను ఒకే వేదికమీద సమకూర్చడం తానా చరిత్రలో ఒక మైలురాయి అని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథులందరికీ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్యఅంశాలమీద అంతర్జాలంలో జరుపుకుంటున్న ఈ 57 వ సమావేశం ఎంతో విశిష్టమైనదని, కట్టడాలు, పట్టణాలు కూలిపోవచ్చు గాని వీరు సృస్టించిన సాహిత్యం అజరామరం అని తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాషా సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నంచేసిన ఎంతోమంది కవుల, పండితుల తరతరాల వారసులు పాల్గొంటున్న ఇదొక అపూర్వ సమ్మేళనం అని, ఇది కేవలం వారు తమ వారసులకోసం మిగిల్చిన సంపద గాదని, ఇది తెలుగు జాతి సంపద అని, వారు సృష్టించిన సాహిత్యాన్ని భద్రపరచి, భావితరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిదీ అన్నారు. మహాకవి తిక్కన, మహాకవి ఎర్రాప్రగడ, కంచెర్ల గోపన్న, కొప్పరపు సోదర కవులు, మహాకవి పోతన, మహాకవి శ్రీనాథుడు, పరవస్తు చిన్నయసూరి మరియు వేంకట, పార్వతీశ్వర జంట కవులకు ఈ వేదికమీద వారి వారసులమధ్య పుష్పాంజలి ఘటించే అవకాశం గల్గడం తమ అదృష్టం అన్నారు”.
విశిష్టఅతిథులుగా పాల్గొన్న - శ్రీ తలుపూరు వెంకట రామకృష్ణ, మహాకవి తిక్కన 19వ తరం వంశీయులు; శ్రీ గుడ్లూరు వెంకట పద్మనాభరావు, మహాకవి ఎర్రాప్రగడ 9వ తరం వారసులు; శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ, ప్రముఖ రచయిత; శ్రీ కంచర్ల శ్రీనివాసరావు, కంచెర్ల గోపన్న (భద్రాచల భక్తరామదాసు) 10వ తరం వారసులు; శ్రీ మా శర్మ, కొప్పరపు కవుల మనుమడు, ప్రముఖ పాత్రికేయులు, కొప్పరపు కళాపీటం వ్యవస్థాపకులు; శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, మహాకవి పోతన 10వ తరం వంశీయులు, ప్రముఖ రచయిత్రి; డా. కావూరి శ్రీనివాస్ శర్మ, శ్రీనాథ మహాకవి వంశీకుడు, ప్రముఖ కవి, శాసన, చారిత్రిక పరిశోధకుడు; డా. వోలేటి పార్వతీశం, వేంకట పార్వతీశ్వరకవుల పౌత్రుడు, వచనకవి, గేయకవి; శ్రీ పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు చిన్నయసూరి గారి 5వ తరం వారసులు పాల్గొని వారి వారి పాండిత్య వైభవాలను మాహాద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతంచేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది.
నాలున్నర గంటలకు పైగా సాగిన పూర్తికార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలలో వీక్షించవచ్చును, మీ బంధుమిత్రులతో కూడా పంచుకోవచ్చును.
https://www.youtube.com/live/iwjWLrOJuEE?feature=share
https://youtube.com/live/X3ZQ4T0-qAg?feature=share
https://youtube.com/live/RuCNXF8sXks?feature=share