హైదరాబాద్ మరియు బెంగళూరులో సాల్టెడ్ బటర్ శ్రేణిని ఆవిష్కరించిన సిద్స్ ఫార్మ్
ఆవు మరియు గేదె వెన్న 100గ్రా టబ్ రూ. 100కి లభించనుంది.
హైదరాబాద్ ఆగష్టు 1, 2023: తెలంగాణకు చెందిన ప్రీమియం D2C డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్ , ఈరోజు తమ కొత్త సాల్టెడ్ బటర్ శ్రేణిని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది, ఇందులో ఆవు మరియు గేదె వెన్న ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ తొలుత హైదరాబాద్ మరియు బెంగళూరు మార్కెట్‌లలో అందుబాటులో ఉంటుంది, ఆగస్టు 1, 2023 నుండి నేరుగా వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.
ఈ కొత్త వెన్న శ్రేణి లో యాంటీబయాటిక్‌లు లేవు, ప్రిజర్వేటివ్‌లు లేవు మరియు హార్మోన్లు లేవు, సులభంగా వినియోగించటం కోసం ఆకర్షణీయమైన 100గ్రా బాక్స్‌లలో వస్తుంది.
సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ, “మేము స్వచ్ఛమైన మరియు కల్తీ లేని పాలు మరియు పాల ఉత్పత్తుల శ్రేణిని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, సాల్టెడ్ బట్టర్ ను మా శ్రేణిలో విడుదల చేసాము. ఈ వెన్న పూర్తిగా స్వచ్ఛమైన ఆవు మరియు గేదె పాల నుండి తయారవుతుంది, ఇది అద్భుతమైన రుచి మరియు మంచి ఆరోగ్యానికి హామీ ఇస్తుంది..." అని అన్నారు.
సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన కల్తీ లేని పాలు మరియు పాల ఉత్పత్తులను అందిస్తుంది. ప్రతి బ్యాచ్ పాలు యూరియా, షుగర్, గ్లూకోజ్, స్టార్చ్, పెరాక్సైడ్, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా, ఫార్మాలిన్, మెలమైన్ మరియు మూడు రకాల యాంటీబయాటిక్స్ యొక్క ఉనికిని తొలగించడానికి అనేక పరీక్షలను ఎదుర్కొంటాయి.
సిద్స్ ఫార్మ్ లో, పాలను కొనుగోలు చేసే దశ నుంచే పరీక్ష ప్రారంభమవుతుంది. జీరో ప్రిజర్వేటివ్‌లు, సంకలనాలు, యాంటీబయాటిక్‌లు, హార్మోన్లు లేదా ఏదైనా ఇతర కల్తీ పదార్థాలతో పాల ఉత్పత్తులను డెలివరీ చేయడం లేదని నిర్ధారించడానికి ప్రతి పాల డబ్బా నాలుగు కఠినమైన స్థాయి పరీక్షల ను ఎదుర్కొంటుంది.
--