G20 సదస్సు జ్ఞాపకార్ధం చోకర్ నెక్లెస్ విడుదల చేసిన PNG జ్యువెలర్స్ x వసుపతి జ్యువెలర్స్

నాగ్‌పూర్, ఇండియా  — ఈ సంవత్సరపు  G20 శిఖరాగ్ర సదస్సులో భారతదేశపు అధ్యక్ష పదవికి సంబంధించిన ఒక అద్భుతమైన వేడుకలో, PNG జ్యువెలర్స్ మరియు వసుపతి జ్యువెలర్స్  భాగస్వామ్యం చేసుకుని అద్భుతమైన చోకర్ నెక్లెస్‌ను రూపొందించడం ద్వారా మన గ్రహం పట్ల ఐక్యత, భాగస్వామ్య బాధ్యత మరియు సామూహిక నిబద్ధతను ప్రతిబింబించాయి .  నాగ్‌పూర్‌లో PNG జ్యువెలర్స్ కొత్త స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు.


ఈ కళాఖండం, 2023 సంవత్సరపు  ధోరణులను పరిగణలోకి తీసుకుని రూపొందించారు, ఇది పూల ఆకృతుల సొగసుపై దృష్టి సారించటం తో పాటుగా , జీవిత వృక్షం  ను ప్రతిబింబిస్తూ  భారత జాతీయ పుష్పం తామర పువ్వుని  ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న  భారతదేశానికి ప్రతీకగా నిలుపుతూనే ,  19 ఇతర సభ్య దేశాలను ప్రతిబింబించేలా ఆ దేశాల జాతీయ పుష్పాలను అత్యంత చాకచక్యంగా మిళితం చేసి  "ఒకే భూమి. ఒకే  కుటుంబం. ఒకటే  భవిష్యత్తు." అనే సదస్సు యొక్క మార్గదర్శక నినాదాన్ని అత్యంత అందంగా తెలియజేస్తుంది. 


PNG జ్యువెలర్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ , "G20 సదస్సు యొక్క స్మారక చోకర్ నెక్లెస్ ప్రపంచ దేశాలు సామరస్యపూర్వకమైన మరియు పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం ముందుకువెళ్ళే భాగస్వామ్య దృష్టికి కళాత్మక స్వరూపం. ఇది G20 సదస్సు యొక్క సారాంశాన్ని ప్రతిధ్వనించటం మాత్రమే కాదు,  ఆతిథ్య దేశంగా భారతదేశం యొక్క పాత్రను వేడుక చేసుకుంటుంది.  ఈ నెక్లెస్ దాని రూపాన్ని మించి, ప్రపంచ ఐక్యత మరియు సామూహిక బాధ్యత సందేశాన్ని కలిగి ఉంది. ఈ ముఖ్యమైన సందర్భానికి గుర్తుగా ,  ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడానికి వసుపతి జ్యువెలర్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా వున్నాము " అని అన్నారు. 

వసుపతి జ్యువెలర్స్ క్రియేటివ్ డైరెక్టర్ శ్రీ అవ్నిప్ కొఠారి మాట్లాడుతూ , "ఈ కళాఖండాన్ని రూపొందించడం అనేది మన గ్రహం యొక్క శ్రేయస్సు కోసం ప్రేమ మరియు నిబద్ధతతో కూడిన ప్రయత్నం . నెక్లెస్‌లోని ప్రతి అంశం, అంటే , నెక్లెస్ యొక్క బేస్ ని  నిర్మాణం లో వినియోగించిన  ఖచ్చితమైన ఫిలిగ్రీ టెక్నిక్ నుండి జోర్ఎనామెల్ టెక్నిక్  ఆయిన  ప్లిక్యూ ను అద్భుతమైన రీతిలో వినియోగించటం  వరకు  , ఐక్యత మరియు సామరస్య భావాన్ని రేకెత్తించడానికి జాగ్రత్తగా ఎంపిక చేయబడినవి. రంగులేని పువ్వులు, దేశాల వైవిధ్యానికి ప్రతీక గా మాత్రమే కాదు  మన భాగస్వామ్య ప్రయోజనానికి శక్తివంతమైన సాక్ష్యంగానూ  నిలుస్తాయి. ఈ నెక్లెస్ ను  10 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన కారిగార్లు 75 రోజులు కష్టపడి రూపొందించారు మరియు  సుమారు 320 గ్రాముల బంగారం తో ఇది రూపుదిద్దుకుంది " అని అన్నారు. 


నెక్లెస్ యొక్క సృష్టి సాంప్రదాయ హస్తకళను సమకాలీన కళాత్మకతను మిళితం చేసే ఒక ఖచ్చితమైన ప్రయాణం. అతి  సున్నితమైన పూల నమూనాలు మైనపు ముద్ద లో చక్కగా చెక్కబడిన తరువాత , దోషరహిత ముగింపుని సాధించడానికి ఆ తరువాత  పోత పోశారు. ఈ ఆభరణం పచ్చని అవెంచురిన్ స్టోన్ తో  అలంకరించబడింది, ఇది మన విలువైన భూమికి ప్రతీక. దీని డిజైన్ మాటీ  మరియు హై పాలిష్ ఫినిషింగ్‌ల సమతుల్యతను  అంతర్లీనంగా ప్రదర్శిస్తుంది , ఆక్సిడైజ్డ్ బేస్‌తో క్లిష్టమైన పూల మూలాంశాలు ప్రముఖంగా నిలబడటానికి అనుమతిస్తుంది.


G20 దేశాల మధ్య ఐక్యత యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తూ,  ఈ  పువ్వులు రంగు లేకుండా ఉంటాయి, భిన్నత్వం లో ఏకత్వం  యొక్క స్పష్టమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ఎంపిక సహకారం మరియు భాగస్వామ్యం యొక్క అద్భుతమైన సందేశాన్ని పంపుతుంది, ఉజ్వలమైన ప్రపంచ భవిష్యత్తు కోసం G20 సమ్మిట్ యొక్క భాగస్వామ్య బాధ్యత యొక్క నీతిని ప్రతిధ్వనిస్తుంది.


మొత్తానికి, PNG జ్యువెలర్స్ x వసుపతి జ్యువెలర్స్ G20 సదస్సు స్మారక చోకర్ నెక్లెస్ కేవలం సున్నితమైన ఆభరణం మాత్రమే కాదు; ఇది ఐక్యత  యొక్క స్ఫూర్తి , భాగస్వామ్య బాధ్యత మరియు మన గ్రహం యొక్క అభివృద్ధికి సామూహిక నిబద్ధత కు  స్పష్టమైన స్వరూపం. G20 శిఖరాగ్ర సమావేశం సమీపిస్తున్న వేళ, ఈ కళాఖండం ప్రపంచ సామరస్యం మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను శాశ్వతంగా గుర్తు చేస్తుంది.

More Press News