దసరా సందర్భంగా తెలంగాణ-ఆంధ్రా ప్రాంతాల మధ్య పెరిగిన బస్సుల రద్దీ

 గతేదాడితో పోలిస్తే 40% పెరిగిన బుకింగ్స్ : రెడ్ బస్

• బస్సు ప్రయాణానికి అత్యధిక డిమాండ్ ఉన్న మార్గం హైదరాబాద్-బెంగళూరు

• దసరా సందర్భంగా బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాల్లో ప్రధానమైనది బాపట్ల



 హైదరాబాద్, 19 అక్టోబర్, 2023 – దసరా సమీపిస్తున్న వేళ , ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ అయినటువంటి రెడ్‌బస్.. మొత్తం ఆంధ్ర-తెలంగాణ ప్రాంత బస్ రూట్లలో బస్ బుకింగ్‌లను పెంచింది. పండుగకు ముందు, అలాగే ఈ పండుగ సెలవు సీజన్‌లో ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, 14 రోజుల ముందుగానే టిక్కెట్ బుకింగ్‌లలో గణనీయమైన 40% పెరుగుదల కన్పించింది. ఈ పెరుగుదల ఇండస్ట్రీ డేటాబేస్ మరియు రెడ్ బస్ ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకున్న సమాచారం ఆధారంగా లెక్కించారు.



 పండుగ సెలవల్లో చాలామంది ఊర్లు వెళ్తుంటారు. మరికొంతమంది హాలిడే టూర్లు వెళ్తుంటారు. ఇప్పుడు ఈ హాలిడే సీజన్ సందర్భంగా నగరవాసులు చాలామంది బాపట్ల, మచిలీపట్నం, రామోజీ ఫిల్మ్ సిటీలకు వెళ్తున్నారు. హైదరాబాదీలు ఎక్కువగా వెళ్తున్న ప్రాంతాలు ఇవే. మరోవైపు తిరుపతి, శ్రీశైలం,  అన్నవరం దేవస్థానాలకు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా వెళ్తున్నారు. దసరా సెలవల సమయంలో హైదరాబాద్ ఒక ముఖ్యమైన అవుట్‌బౌండ్ ట్రావెల్ హబ్‌గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల అంతర్రాష్ట్ర మరియు అంతర్రాష్ట్ర ప్రయాణాలలో 40% కంటే ఎక్కువ ప్రయాణాలు జరుగుతుంటాయి. పండుగల సమయంలో రోజుకు 3.2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. హైదరాబాద్ తర్వాత, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ & కర్నూలు నుండి అత్యధిక అంతర్-రాష్ట్ర ట్రాఫిక్ వస్తుంది.



 ఈ సందర్భంగా రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "దసరా సెలవలు ఒక ముఖ్యమైన ప్రయాణ సందర్భం. ఈ సందర్భంగా ప్రజలు అన్ని రకాల ప్రాంతాలకు ప్రయాణ చేయడాన్ని మేం గమనించాం. బంధువులు లేదా సొంత ఇంటికి వెళ్లడం, మరియు మతపరమైన ప్రయాణాలు ఎక్కువగా ఈ సీజన్ లో జరుగుతుంటాయి. మెరుగైన రహదారి మరియు మౌలిక సదుపాయాలు కూడా పెరగడం వల్ల బస్సు ప్రయాణానికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతంలోని బస్ మార్కెట్ గతేడాదితో  పోలిస్తే 40% ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది. అయితే ఈ ట్రెండ్ ను మేం ఈ ఏడాది చివరినాటికి అంచనావేశాం. మా వినియోగదారులు మరియు మా భాగస్వామి బస్సు ఆపరేటర్‌లు ఈ సీజన్ ను మరింతగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అని అన్నారు ఆయన. 



ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య అంశాలు:

● దసరా సందర్భంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మధ్య మార్గాలు (క్రమంలో):

1. హైదరాబాద్-బెంగళూరు-హైదరాబాద్

2. తిరుపతి-బెంగళూరు-తిరుపతి

3. హైదరాబాద్-చెన్నై-హైదరాబాద్

4. హైదరాబాద్-ముంబై-హైదరాబాద్

5. నెల్లూరు-బెంగళూరు-నెల్లూరు

 

దసరా సమయంలో రాష్ట్రంలో ప్రముఖ పట్టణాల మధ్య ప్రయాణ రూట్లు (క్రమంలో):

1. హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్

2. విశాఖపట్నం-హైదరాబాద్-విశాఖపట్నం

3. హైదరాబాద్-ఒంగోలు-హైదరాబాద్

4. హైదరాబాద్-నెల్లూరు-హైదరాబాద్

5. హైదరాబాద్-గుంటూరు-హైదరాబాద్

More Press News