సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Key Remarks on Sex Workers Rights
  • స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టు
  • వీరిపై దాడులు చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్య
  • వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరమని మీడియాకు హెచ్చరిక
సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 

సుప్రీంకోర్టు ప్రకారం... స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి వచ్చిన మేజర్లు అయిన సెక్స్ వర్కర్లపై పోలీసులు దాడి చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధం. వ్యభిచార వృత్తిలో ఉన్నారనే కారణంతో వారిని వేధించడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని సుప్రీం గుర్తు చేసింది. 

సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం, వారి గుర్తింపును బహిర్గతం చేయడం నేరమని మీడియాకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇతర పౌరుల మాదిరిగానే సెక్స్ వర్కర్లకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆదేశించింది. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్లు అందరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని యూఐడీఏఐని ఆదేశించింది. సరైన గుర్తింపు పత్రాలు లేని కారణంగా సంక్షేమ పథకాలకు వారు దూరం కాకూడదని వ్యాఖ్యానించింది. బలవంతపు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేర ముఠాలను టార్గెట్ చేయాలని పోలీసు శాఖకు సూచించింది.
Go Back to Shorts
Supreme Court
Sex workers
Human trafficking
Article 21
UIDAI
Aadhar card
Indian Constitution
Prostitution
Legal rights
Welfare schemes

More Telugu News