పవన్ ఒక ప్యాకేజ్ స్టార్.. జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళతారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
- పవన్‌ను ప్యాకేజ్ స్టార్‌గా అభివర్ణించిన ఎమ్మెల్యే
- ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదని వ్యాఖ్య
- తెలంగాణ జోలికొస్తే 'గో బ్యాక్ ఆంధ్ర' ఉద్యమం తప్పదని హెచ్చరిక
- హైదరాబాద్‌లో ఆస్తులు పెట్టుకుని అమరావతి కట్టడంపై ప్రశ్న
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను ఒక 'ప్యాకేజ్ స్టార్' అని అభివర్ణిస్తూ, భవిష్యత్తులో వైఎస్ జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆయనకు మద్దతు ఇవ్వడానికి కూడా వెనుకాడరని ఎద్దేవా చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి, అర్హత పవన్ కల్యాణ్‌కు లేవని అనిరుధ్ రెడ్డి అన్నారు. "దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయండి. ఆయన ఇంటి ముందు నేను అడ్డుగా నిలబడతా" అంటూ పవన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డల జోలికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా రావాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవసరమైతే మళ్లీ ‘గో బ్యాక్ ఆంధ్ర’ ఉద్యమం మొదలవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఏపీ రాజకీయ నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. "మీరంతా ఉండేది హైదరాబాద్‌లో, ఆస్తులు సంపాదించుకునేది ఇక్కడే. మరి అన్ని వేల కోట్లు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని, తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.