సచివాలయం ఉంటే ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పారండీ?: బొత్స
- సచివాలయం ఉన్నంతమాత్రాన ఉద్యోగాలు రావన్న బొత్స
- విశాఖ మహానగరంగా ఎదిగితే ఉద్యోగాలు వస్తాయని స్పష్టీకరణ
- అందుకే విశాఖలో సచివాలయం ఏర్పాటు చేశామని వెల్లడి
- ఆ మాత్రం బుర్ర మాకూ ఉందని వ్యాఖ్యలు
ఉత్తరాంధ్ర ప్రాంతం పరిస్థితిపై తమకు అవగాహన ఉందని, విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసినంత మాత్రాన ఉద్యోగాలు రావని తమకు కూడా తెలుసని అన్నారు. సెక్రటేరియట్ వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పారండీ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు దీటుగా ఓ మహానగరంగా ఎదిగే క్రమంలో విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయాలనుకున్నామని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందని విశాఖలో ఓ సచివాలయం కూడా ఏర్పాటైతే, ఓ రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో ఖర్చు చేస్తే, అది క్రమంగా మహానగరంగా ఎదుగుతుందని, అప్పుడు ఉద్యోగాలు వస్తాయని, ఆ విషయం తమకు తెలుసని బొత్స వెల్లడించారు.
"విశాఖలో ఆఫీసు బిల్డింగ్ లు నిర్మించి, ఇంట్లో కూర్చుంటామని అనుకోకండి. మీకేనా బుర్ర ఉంది, మాకు లేదా? మీలాగా పైపై మెరుగులతో చేయడం మాకు తెలియదు, జగన్ గారు అంతా రియాల్టీకి ప్రాధాన్యమిస్తారు, మాది ప్రాక్టికల్ ప్రభుత్వం. ఇవాళ సౌతిండియాలో హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, రేపు విశాఖ గురించి కూడా అలాగే మాట్లాడుకోవాలి" అంటూ బొత్స వివరించారు.