హెల్మెట్ లో పాము పిల్ల.... జడుసుకున్న కేరళ ఉపాధ్యాయుడు!
- హెల్మెట్లో చచ్చిన పాముపిల్ల
- చూసుకోకుండా 11 కిలోమీటర్లు ప్రయాణించిన ఉపాధ్యాయుడు
- టీచర్ కు వైద్యపరీక్షలు చేయించిన మిత్రులు
- పాము కాటు వేయలేదన్న వైద్యులు
కేరళలో ఓ ఉపాధ్యాయుడికి భయానక అనుభవం ఎదురైంది. హెల్మెట్లో ఓ పాము పిల్ల ఉందని తెలియకుండానే ఆయన 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఆ తర్వాత హెల్మెట్లో పాము పిల్లను చూసి హడలిపోయిన ఘటన మీడియా దృష్టిని ఆకర్షించింది. కేరళలోని కందానాద్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో రంజిత్ సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే స్కూలు ముగిసిన తర్వాత బైక్ మీద వెళుతుండగా, హెల్మెట్లో ఏదో ఉన్నట్టు అనిపించింది. దాంతో బైక్ ఆపి హెల్మెట్ ను పరిశీలించగా, అందులో ఓ పాము పిల్ల కనిపించింది. అది అప్పటికే చనిపోయి ఉన్నా, విషసర్పం కావడంతో భయకంపితుడయ్యాడు.
రంజిత్ ఈ విషయాన్ని స్నేహితులకు తెలియజేశాడు. దాంతో వాళ్లు కూడా వచ్చి హెల్మెట్ ను పరిశీలించి, పాము కాటేసి ఉండొచ్చన్న అనుమానంతో రంజిత్ ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో పాము కాటువేయలేదని తేలడంతో హమ్మయ్య అనుకున్నారు. అయితే, ఆ పాము పిల్ల హెల్మెట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. తమ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉందని, ఆ పరిసరాల నుంచి వచ్చిన పాము హెల్మెట్లో దూరి ఉంటుందని రంజిత్ భావిస్తున్నాడు. చచ్చినపామును ఎవరైనా హెల్మెట్లో పెట్టారేమోనని అనుమానం వచ్చినా దానిపై రంజిత్ కు, అతని స్నేహితులకు ఎలాంటి స్పష్టత లేదు.