ఆయనను నేనెప్పుడూ టెర్రరిస్ట్ అని పిలవలేదు: జవదేకర్
- అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు
- కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడం వల్లే ఆప్ గెలిచిందన్న జవదేకర్
- కేజ్రీవాల్ ను టెర్రరిస్టు అన్నారంటూ 10 రోజుల క్రితం జాతీయ మీడియాలో వార్త
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను తానెప్పుడూ టెర్రరిస్టు అని పిలవలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేజ్రీవాల్ ను జవదేకర్ టెర్రరిస్టుగా సంబోధించారంటూ 10 రోజుల క్రితం ఓ జాతీయ టీవీలో వచ్చిన వార్త చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా జవదేకర్ స్పందిస్తూ, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోవడం వల్లే ఆప్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
తానేమైనా టెర్రరిస్టునా? అని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ అడుగుతుంటారని... ఆయన టెర్రరిస్టేనని, అందుకు చాలా ఆధారాలు ఉన్నాయని జవదేకర్ గతంలో అన్నారు. 'తాను అరాచకవాదినని మీకు మీరే చాలా సార్లు చెప్పారు. అరాచకవాదికి, టెర్రరిస్టుకు పెద్ద తేడా ఏమీ లేదు' అని ఎన్నికల సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నాన్ని జవదేకర్ చేశారు.