ఆ నాటి పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్‌కి అలా జరిగింది: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పార్టీ పెట్టగానే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు
- అలా రావడం అందరికీ సాధ్యం కాదు
- ప్రస్తుత సమాజం స్వార్థంతో దారి పట్టింది
- నాయకులు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు
అప్పట్లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి దివంగత ఎన్టీఆర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... పార్టీ పెట్టగానే ఆయనలా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్‌కే అలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజం స్వార్థం దారి పట్టిందని, ఉచితంగా అన్నీ అందిస్తాం అనే మాటలతో రాజకీయ నాయకులు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
జనసేన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను చాలా దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించానని, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని, తమ పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు తమకు ఓట్లేశారని తెలిపారు.