మద్యం లేని భారతావనిని నిర్మించాలి: నితీశ్ కుమార్

  • మనుషుల జీవితాలను మద్యం చిదిమేస్తోంది
  • దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం గాంధీ ఆశయం
  • బీహార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
మద్య నిషేధంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషుల జీవితాలను మద్యం చిదిమేస్తోందని, మద్యం లేని భారతావనిని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి.. దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలన్నది మహాత్మాగాంధీ ఆశయమన్నారు. గతంలో దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేసినా ఆ తర్వాత దానిని ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2011 నుంచి బీహార్‌లో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తూ 2016 నాటికి పూర్తిగా నిషేధించామని నితీశ్ కుమార్ వివరించారు.


More Telugu News