మోదీ, జగన్, చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్
- నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
- కేసీఆర్ తరఫున ట్వీట్ చేసిన తెలంగాణ సీఎంవో
ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం. కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు విషెస్ తెలిపినవారికి సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం జగన్ కు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. అంతేకాదు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ ద్వారా కేసీఆర్ కు విషెస్ చెప్పగా, వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.