నా వర్కౌట్లు చూసి ఎవరైనా స్ఫూర్తి పొందితే చాలా సంతోషిస్తా: రకుల్
- తన జీవితంలో ఫిట్ నెస్ ఓ భాగమైపోయిందన్న రకుల్ ప్రీత్
- ఫిట్ నెస్ సాధనకు దగ్గరిదారులు ఉండవని వ్యాఖ్యలు
- ఒక వారంలో ఫిట్ నెస్ సాధించడం సాధ్యం కాదని వెల్లడి
ఒక వారంలో ఎవరైనా ఫిట్ నెస్ సాధించగలమంటే అది నమ్మశక్యం కాని విషయం అని టాలీవుడ్ అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఫిట్ నెస్ సాధించేందుకు దగ్గరదారులంటూ ఏవీ ఉండవని స్పష్టం చేసింది. తన జీవితంలో ఫిట్ నెస్ అనేది ఓ భాగమైపోయిందని, సోషల్ మీడియాలో తన వర్కౌట్లు చూసి ఎవరైనా స్ఫూర్తి పొందితే చాలా సంతోషిస్తానని రకుల్ ప్రీత్ తెలిపింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందని, అందుకు తగినవిధంగా ఆలోచనా సరళి మార్చుకోవాలని సూచించింది. ఆరోగ్యం కోసం సమయం కేటాయించని జీవితాలెందుకు అంటూ వ్యాఖ్యానించింది.