బాహుబలి కిలికి భాషకు వర్ణమాల రూపొందించిన తమిళ గీత రచయిత

  • బాహుబలి చిత్రంతో బాగా ప్రాచుర్యం పొందిన కిలికి భాష
  • ప్రేక్షకులను విశేషంగా అలరించిన కిలికి పదాలు
  • వర్ణమాల రూపొందించిన గీత రచయిత మదన్ కార్కీ
  • రాజమౌళి చేతులమీదుగా కిలికి వెబ్ సైట్ ఆవిష్కరణ
బాహుబలి చిత్రంలో కాలకేయులు మాట్లాడే కిలికి భాష ఎంత పాప్యులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విచిత్రంగా ధ్వనించే కిలికి భాష పదాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వాస్తవానికి బాహుబలి చిత్రం కోసమే పుట్టిన భాష కిలికి. అలాంటి భాష ప్రపంచంలో ఎక్కడా లేదు. దర్శకుడు రాజమౌళి కోరడంతో తమిళ లిరిక్ రైటర్ మదన్ కార్కీ ఎంతో శ్రమించి కిలికి భాష పదజాలాన్ని రూపొందించారు. ఇప్పుడాయనే మళ్లీ కిలికి భాషకు అక్షర రూపం ఇచ్చారు. ఈ భాష నేర్చుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వర్ణమాల రూపొందించారు. అందుకోసం ఏకంగా ఓ వెబ్ సైట్ (https://www.kiliki.in) ను సిద్ధం చేశారు. ఈ కిలికి వెబ్ సైట్ ను రాజమౌళి ఆవిష్కరించారు. 2013 నుంచి మదన్ కార్కీ కిలికి భాషకు రూపకల్పన చేస్తున్నారు. ఈ భాషలో 22 అక్షరాలు ఉంటాయి.


More Telugu News