వినాశకాలే.. విపరీత బుద్ధి: వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి ఆగ్రహం
- అమరావతి ఉద్యమంపై డ్రోన్ల నిఘా
- పైకప్పు లేని బాత్రూములు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు
- అమరావతి ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా?
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం డ్రోన్లతో నిఘా వేయడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సుధారాణి స్పందించారు. వైసీపీ పాలన వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఉందన్నారు.
మహిళల స్నానపు గదులపై డ్రోన్లు ఎగరవేయడాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పల్లెల్లో పైకప్పు లేని స్నానపు గదులు ఉంటాయని, డ్రోన్లు తిప్పొద్దని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి సుచరిత, రోజా నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, అమరావతి ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? అని సంధ్యారాణి ప్రశ్నించారు.