ఇక లాభాల బాట పట్టనున్న 'భీష్మ
- తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' జోరు
- మూడు వారల వరకూ లేని పోటీ
- మరింతగా పెరగనున్న వసూళ్లు
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల తెరకెక్కించిన 'భీష్మ' .. భారీ ఓపెనింగ్స్ తో తన పరుగును ప్రారంభించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కథాకథనాల పరంగా .. ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై కొనుగోలుదారులు పెట్టిన పెట్టుబడిలో అప్పుడే 80 శాతం వరకూ వెనక్కి వచ్చేసిందట. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక త్వరలోనే లాభాల బాట పట్టనుందని అంటున్నారు. ఓ మూడు వారాల వరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ లేవు. అంటే 'బీష్మ'కి గట్టి పోటీ ఇచ్చే సినిమాలేవీ లేవు. అందువలన ఈ సినిమా భారీ మొత్తాలే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకట్టుకునే కథ .. ఆసక్తికరమైన కథనం .. నితిన్ - రష్మికల రొమాన్స్ .. సంగీతం .. పాటలు .. చిత్రీకరణ ఇలా ఈ సినిమాకి అన్నీ కలిసిరావడంతో ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.