పార్టీలో ఏ2 పదవి ఇవ్వకపోతే రాసిన దొంగ లెక్కలు బయటపెడతా అని జగన్ గారిని బెదిరించారు: బుద్ధా వెంకన్న

  • విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు
  • జగన్ గారిని బెదిరించి పదవులు కొట్టేసిన మీలా అందరూ ఉంటారా?
  • 43 వేల కోట్ల రూపాయలు కొట్టేసింది జగన్ గారే
  • అందుకే మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు 
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి విమర్శల జల్లు కురిపించారు. 'రూ.6 లక్షల కోట్లు కుంభకోణం అని జగన్ గారు పుస్తకం రాయించారు. ఆ పుస్తకంలో ఉన్న 6 లక్షల కోట్లు వెతకడానికి తమిళనాడులోని కుంభకోణం వెళ్లి తప్పిపోయాడు విజయసాయిరెడ్డి  గారు' అని పేర్కొన్నారు.

'పార్టీలో A2 పదవి ఇవ్వకపోతే రాసిన దొంగ లెక్కలు బయటపెడతా అని జగన్ గారిని బెదిరించి పదవులు కొట్టేసిన మీలా అందరూ ఉంటారు అనుకుంటే ఎలా?' అని విమర్శించారు.

'ఈఎస్ఐ వ్యవహారంలో తన పాత్ర లేదు కాబట్టే అచ్చెన్న దైర్యంగా మీడియా ముందుకు వచ్చి సవాల్ విసిరారు. 43 వేల కోట్ల రూపాయలు కొట్టేసింది జగన్ గారే కాబట్టి మీడియా ముందుకు రావడానికి భయపడి చాటుగా ఉంటున్నారు. మౌనమే 43 వేల కోట్ల స్కామ్ కి అంగీకారం సాయి రెడ్డి గారు' అని ట్వీట్ చేశారు.


More Telugu News