ఇప్పుడు తెలంగాణలో.. లేడీస్ హాస్టల్‌లోని స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపిన అబ్బాయి!
- సంచలనం సృష్టించిన నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన
- తాజాగా ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో
- వారికి సహకరించిన మరో ముగ్గురు అమ్మాయిలనూ కాలేజీ నుంచి తొలగించిన ప్రిన్సిపాల్
ఇటీవల ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్‌లోకి ఓ అబ్బాయి దూరి రాతంత్రా గడిపిన ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటన ఇంకా మర్చిపోకముందే అచ్చం అటువంటిదే తెలంగాణలోనూ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని ఓ లేడీస్ హాస్టల్‌లోకి ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. వారు ఇద్దరూ కుమురం భీం జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారని, వారి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. దీంతో ప్రియురాలిని చూసేందుకు ప్రహరీ దూకి, వెంటిలేటర్ గుండా లోపలికి ప్రవేశించాడు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి గదిలో మరో ముగ్గురు ఉన్నప్పటికీ విషయం వెలుగులోకి రాలేదు. మరుసటి రోజు గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది అబ్బాయిని గమనించి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎంఈవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి అబ్బాయి, అమ్మాయిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు. కాగా, వీరికి సహకరించిన మరో ముగ్గురిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.