మరాఠీ మూవీ రీమేక్‌లో బావతో సల్మాన్ ఖాన్!
- సిక్కు పోలీసు అధికారి పాత్రలో సల్మాన్
- గ్యాంగ్‌స్టర్ గా నటించనున్న ఆయుశ్ శర్మ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాలో మరోసారి పోలీసు పాత్రలో అలరించనున్నాడు. అయితే, గత చిత్రాలకు భిన్నంగా ఈ సారి సిక్కు పోలీసుగా కనిపించనున్నాడు. పైగా, ఈ సినిమాలో సల్మాన్ బావ (చెల్లిలి భర్త) ఆయుశ్ శర్మ కూడా నటిస్తున్నాడట. దాంతో, బావమరుదులు కలిసి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో ఆయుశ్.. నార్త్ ఇండియన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా 2018లో మరాఠీలో విడుదలైన ‘ముల్షి పాటర్న్’కు రీమేక్ అని తాజా సమాచారం. అయితే, ఇందులో హీరో సల్మాన్ కాదట. అతనిది సపోర్టింగ్ హీరో క్యారెక్టర్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్ పాత్రలోని ఆయుష్‌ను సల్మాన్ వెంబడిస్తూ ఉంటాడట.
కాగా, రెండేళ్ల కిందట విడుదలైన ‘ముల్షి పాటర్న్’ మరాఠీలో భారీ విజయం సాధించింది. దాంతో, సినిమా డైరెక్టర్ ప్రవీణ్ తార్డె తమ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరైన సల్మాన్, అర్బాజ్ ఖాన్‌కు ఈ సినిమా బాగా నచ్చిందట. దాంతో, దీన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, హిందీ మూవీకి ప్రవీణ్ కాకుండా అభి మినవాల దర్శకత్వం వహించబోతున్నారు.