కాలేజీకి వెళ్లని కొడుకు.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
- చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘటన
- మందలించినా మారని కుమారుడి ప్రవర్తన
- పురుగుల మందు తాగి ఉసురు తీసుకున్న తల్లి
కాలేజీకి వెళ్లాలని మందలించినా కొడుకు లెక్క చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని కేవీబీపురం మండలంలో జరిగిందీ ఘటన. మండలంలోని కున్నంకళత్తూరుకు చెందిన మోహన్, జ్యోతి దంపతుల మొదటి కుమారుడు శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
కొడుకు కాలేజీకి సరిగా వెళ్లకపోవడంతో ఈ నెల 25న మందలించింది. అయినప్పటికీ కుమారుడిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం 26న ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం జ్యోతి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.