చిరు తాజా చిత్రంలో సోనూసూద్ కి ఛాన్స్
- కీలక పాత్ర దక్కించుకున్న బాలీవుడ్ నటుడు
- కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ
- తమిళ, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న సోనూసూద్
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూసూద్ ఓ క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో అతనికి ఓ కీలక పాత్ర దక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరుతో కలిసి నటిస్తున్న విషయాన్ని సోనూ తాజాగా ధ్రువీకరించాడు. చిరుతో తెర పంచుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. దక్షిణాది చిత్రసీమ తనను అక్కున చేర్చుకుంటోందన్నాడు. వాళ్లు చూపించే ప్రేమకు ఈ సినిమాతో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. సోనూ ప్రస్తుతం తమిళలో 'తమిలరసన్' అనే సినిమాతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్ కపూర్‌తో కలిసి 'పృథ్వీరాజ్' అనే మూవీలో నటిస్తున్నాడు.