బాధితులకు హాస్టల్స్‌లో పునరావాసమేంటి: జేఎన్యూ రిజిస్ట్రార్‌ ఆగ్రహం

  • ఢిల్లీ బాధితులకు ఆశ్రయం ఇస్తామన్న విద్యార్థి సంఘాలు
  • ఈ మేరకు ట్విట్టర్‌లో మెసేజ్‌
  • మీకా అధికారం లేదన్న రిజిస్ట్రార్‌
ఢిల్లీ అల్లర్ల బాధితులకు జేఎన్‌యూ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామన్న విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ క్యాంపస్‌ను పునరావాస కేంద్రంగా మార్చే అధికారం విద్యార్థి సంఘాలకు లేదని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా, ఎంతోమంది గాయపడ్డారు. బాధితులకు యూనివర్సిటీ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామంటూ ఈనెల 26వ తేదీన విద్యార్థి సంఘాల నేతలు ట్వీట్‌ చేశారు. ఈ మెసేజ్‌పై రిజిస్ట్రార్‌ తాజాగా స్పందించారు. ‘యూనివర్సిటీ క్యాంపస్‌ విద్యార్థులు, పరిశోధకుల కోసం ఉద్దేశించింది. అటువంటి క్యాంపస్‌లో అల్లర్ల బాధితులకు ఆశ్రయం కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్‌ హెచ్చరించారు.


More Telugu News