సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రభాస్ కోసం దీపిక పదుకునే?
- చరణ్ తో సెట్ చేస్తున్న వంశీ పైడిపల్లి
- రామోజీ ఫిలిం సిటీలో పవన్ షూటింగ్
* నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ దీపిక పదుకునేను సంప్రదిస్తున్నారట. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నవంబర్ నుంచి జరుగుతుంది.
* వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో మహేశ్ ఈ ప్రాజక్టుని పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వంశీ ప్రస్తుతం రామ్ చరణ్ తో సంప్రదింపులు చేస్తున్నట్టు, చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
* పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.