ఆలస్యమైనందుకు రణ్ వీర్ సింగ్ కు గుంజీల శిక్ష వేసిన అక్షయ్... వీడియో ఇదిగో!

  • నిన్న 'సూర్యవంశీ' ట్రైలర్ విడుదల
  • 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన రణ్ వీర్
  • సరదాగా ఆట పట్టించిన అక్షయ్
తన భార్య దీపికా పదుకొనే ఇంట్లో ఉన్న కారణంగా ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాడట. అందుకని రణ్ వీర్ సింగ్ తో హీరో అక్షయ్ కుమార్ గుంజీలు తీయించాడు. వివరాల్లోకి వెళితే, రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా 'సూర్యవంశీ' చిత్రం తెరకెక్కగా, ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు.

చిత్రం ట్రయిలర్ విడుదల నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి రణ్ వీర్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆగ్రహాన్ని నటించిన అక్కీ, నీకు క్రమశిక్షణ లేదంటూ ఆట పట్టించాడు. శిక్షగా గుంజీలు తీయాలని ఆదేశించడంతో, వేదికపై రణ్ వీర్ గుంజీలు తీశాడు. వెంటనే అందుకున్న అజయ్ దేవగణ్, 'వదిలేయ్.. వాళ్లావిడ ఇంట్లో ఉంది. అందుకే మనవాడు లేట్ గా వచ్చాడు' అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీన్ని చూసిన దీపిక, "భార్య ఇంట్లో ఉంది. కానీ, ఫంక్షన్లకు సమయానికే వస్తుంది" అని ఫన్నీ కామెంట్ చేసింది.



More Telugu News