తన పేరుతో అమ్మాయిలను ప్రేమలోకి దింపుతున్న యువకుడిపై హీరో విజయ్ దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు
- విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా
- ఆ తర్వాత వాట్సాప్‌లో చాటింగ్
- గుర్తించిన విజయ్ దేవరకొండ
- నిందితుడి కోసం గాలిస్తోన్న పోలీసులు
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో ఖాతా సృష్టించి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన విజయ్ దేవరకొండ అతడి మోసాన్ని మోసంతోనే కట్టడి చేశాడు.
తన సహాయకుడితో అమ్మాయిలా ఆ మోసగాడితో చాటింగ్ చేయించాడు. దీంతో మోసగాడు చేస్తోన్న బాగోతం నిర్ధారణ అయింది. దీంతో విజయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్ దేవరకొండ పేరుతో చాలా కాలం నుంచి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో ఓ యువకుడు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
విజయ్ దేవర కొండ పేరుతో చాటింగ్ చేస్తూ.. ఆ తర్వాత 'నా డబ్బింగ్ ఆర్టిస్టుతో చాటింగ్ చేయండి' అంటూ తన అసలు ఫేస్‌బుక్ ఖాతాను అమ్మాయిలకు పంపిస్తున్నాడు. దాంతో పాటు తన ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాడు.
అనంతరం వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కొందరు విజయ్ దేవరకొండకు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన దీనిపై దృష్టి సారించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.