నాకు కరోనా లేదు.. నేను కనపడకుండాపోయినట్లు వస్తోన్న ప్రచారం సరికాదు: చిత్తూరు వాసి
- నేను చైనా నుంచి రాలేదు
- ఆస్ట్రేలియా నుంచి వచ్చాను
- బెంగళూరులో పనిచేస్తున్నాను
- విమానం దిగాక తనిఖీ కూడా చేశారు
చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం, నెరబైలుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుండ్ల గిరిధర్ కోసం అధికారులు గాలింపు మొదలుపెట్టారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన కనిపించకుండా పోయాడని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ... తానసలు చైనా నుంచి రాలేదని, ఆస్ట్రేలియా నుంచి వచ్చానని స్పష్టం చేశారు. తాను బెంగళూరులో పనిచేస్తున్నానని, తమ సంస్థ తరఫున ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా పనిచేస్తున్నానని ఆయన వివరించారు. రెండు వారాల సెలవులు రావడంతో తాను భారత్కు వచ్చానని చెప్పారు.
ఇటీవలే తాను ఆస్ట్రేలియా నుంచి మలేషియా మీదుగా బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. విమానం దిగిన వెంటనే అధికారులు కూడా తనిఖీ చేశారని, తనకు కరోనా వైరస్ లేదని చెప్పారు. అయితే, తన గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వాధికారులు తన వ్యక్తిగత విషయాలను సేకరించడం సరికాదని వాపోయారు.